నిర్భయ దేశంలో అమ్మాయిలకు రక్షణ లేదని రుజువు చేసిన ఘటన. మనిషి రూపంలో మానవ మృగాలు తిరుగుతున్నాయని నిరూపించిన సంఘటన. యావత్ భారతదేశం దోషులకు శిక్ష ఎప్పుడు వేస్తారా నిర్భయకి ఎప్పుడు న్యాయం చేస్తారా అని గత ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్నారు.

 

 

ఎన్ని ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌ తీహార్ జైలులో ఉరి వేశారు. దింతో జైలు ముందే సంబరాలు జరుపుకున్నారు. ఎన్నాళ్లకు ఆ కన్నతల్లి కడుపు కోతకు న్యాయం జరిగింది.

 

 


 

ఈ సంఘటనపై పలువురు స్పందించారు. ఈ ఘటనపై ప్రముఖ యాంకర్ అనసూయ కూడా స్పందించింది. ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’ అంటూ హిందీలో పోస్టు పెట్టింది. శిక్ష పడటానికి కాస్త ఆలస్యమైనా ఆ యువతికి న్యాయం జరిగిందన్నారు. ఆ యువతిపై అతి కిరాతకంగా లైంగిక దాడి చేసి ఆమె మరణానికి కారణమైన వాళ్లు చట్టపరంగా శిక్షింపబడ్డారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు, శిక్ష అమలును మరింత ఆలస్యం చేసేందుకు నిందితులు న్యాయవ్యవస్థలోని అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని చూశారు. వారు చట్టాలను వినియోగించుకోవడంలో కొంతవరకు విజయం సాధించారు. అయితే చివరకు న్యాయమే గెలిచిందన్నారు.

 

 

ఆ తల్లి తన కూతురికి జరిగిన అన్యాయం కోసం గత ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. ఆ తల్లి కడుపు కోతకు, ఆ తల్లి తన కూతురు కోసం పడిన కష్టానికి నేడు విముక్తి లంభించింది. తన కూతురి ఆత్మకు నేడే అసలైన ఆత్మశాంతి దొరికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: