డాన్స్ బేబీ డాన్స్, ఒన్స్ మోర్ ప్లీజ్, రేలా రే రేలా, సాహసం చేయరా డింభకా, జానవులే నెరజాణవులే లాంటి కిర్రాక్ పుట్టించే టీవీ ప్రోగ్రాములను తెలుగు బుల్లి తెరకు పరిచయం చేసిన ఏకైక యాంకర్ ఉదయభాను ప్రస్తుతం ఏ షో లో ఆఫర్ దక్కించుకోలేకపోతుంది. ఈవెంట్ కార్యక్రమాలలో కూడా ఆమె అవకాశాలను చేజిక్కించుకోలేకపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. కనీసం సినిమాలలో చిన్న చిన్న పాత్రలు కూడా ఆమెను వరించడం లేదు. వాస్తవానికి ఉదయభాను హృదయం చాలా విశాలంగా ఉండేది. అందుకే తాను ఎంతో విషాదకరమైన జీవితాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది.


ఉదయభానుని బుల్లితెర మీద శ్రీదేవి అని చాలా మంది ప్రముఖులు పిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తన నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోవడం... తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడం... ఆ రెండవ తండ్రి తన పై ఎన్నో ఆంక్షలను పెట్టడం లాంటివి ఉదయభాను ఎంతో బాధించాయి. తన కుటుంబం లో ఎన్నో వింత విచిత్రమైన మార్పులు వచ్చినప్పటికీ తాను మాత్రం తన అద్భుతమైన టాలెంట్ తో ముక్తకంఠంతో ఎన్నో ప్రోగ్రాములని ఒంటి చేతితో నడిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.


సాహసం చేయరా డింభకా కార్యక్రమంలో కంటెస్టెంట్స్ కంటే ముందుగానే క్లిష్టతరమైన అన్ని టాస్క్ లను ఆమె చేసి చూపించేది. 2004వ సంవత్సరంలో విజయ్ కుమార్ తో ప్రేమ వివాహం అయిన తర్వాత ఆమె సినిమాలకు కావాలనే దూరం అయ్యిందని చెప్పుకోవచ్చు. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పటికీ... భర్త మాటను గౌరవించి అన్ని టీవీ కార్యక్రమాలకు సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ మంచి గృహస్థురాలిగా అవతారమెత్తి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.


2014వ సంవత్సరంలో నిగ్గదీసి అడుగు అనే టీవీ కార్యక్రమంలో ప్రజల సమస్యలను తీరుస్తాను అంటూ తెలుగు రాష్ట్రాల లోని ప్రతి జిల్లా తిరుగుతూ పెద్ద పెద్ద రాజకీయ నేతలను ఇటువంటి బెరుకు లేకుండా నిలదీస్తూ తనలో ఎంత తెగింపు ఉందో చెప్పకనే చెప్పింది. రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వచ్చినప్పటికీ ఆమె మాత్రం సమాజంలో జరుగుతున్న తప్పులను వేలెత్తి చూపించడానికి ముందడుగు వేసింది తప్ప వెనకడుగు వేసిన సందర్భం అంటూ ఏదీ లేదు. గత ఏడాది దిశ అత్యాచార కేసు పై కూడా ఆమె ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ స్పందించిన తీరు ప్రజలని ఆలోచింపజేశాయి. ఇటువంటి ఉదయభాను కి ఇప్పటికైనా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు రావాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: