తెలుగు చిత్ర పరిశ్రమలు అన్నగారు నందమూరి తారక రామారావు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే నందమూరి తారక రామారావు... నందమూరి తారక రాముడు అంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేంతలా ప్రభావితం చేసాడు సీనియర్ ఎన్టీఆర్. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయినప్పటి నుంచి ఎన్నో ఏళ్ల పాటు తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ప్రజలకు దేవుడిలా మారిపోయాడు నందమూరి తారక రామారావు. నిజంగా రాముడంటే నందమూరి తారకరామారావు లాగే ఉంటారేమో అని అప్పటి ప్రేక్షకులు నమ్మేవారు. అందుకే నందమూరి తారక రామారావుని దేవుడు అనుకునేవారు నాటి తరం ప్రజలు.

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు సినిమాల్లో మెరిసిన  సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రజా సేవ చేయడానికి.. తెలుగుదేశం అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకుని నందమూరి తారక రామారావు అప్పట్లో ఘన విజయాన్ని సాధించి తెలుగువాడి సత్తా చాటారు. ఎన్నో ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు సీనియర్ ఎన్టీఆర్. ఇక సీనియర్ ఎన్టీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చెప్పిందే శాసనం గా మారిపోతూ ఉండేది. ప్రజలు కూడా సీనియర్ ఎన్టీఆర్ ను దేవుడిగా భావించి ఆయననే  గెలిపిస్తూ ఉండేవారు. 

 

 

 అలాంటి సీనియర్ ఎన్టీఆర్ క్రమక్రమంగా రాజకీయాల్లో దెబ్బతింటూ వచ్చాడు. ముఖ్యంగా తన మేనల్లుడైన నారా చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో వెన్నుపోటు పొడిచి  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ తనవైపు తిప్పుకున్నారని  అంటుంటారు చాలామంది. తన కుళ్లు కుతంత్రాలతో రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుని అధికారాన్ని చేపట్టాడు అని చెబుతూ ఉంటారు. ఇలా చిత్ర పరిశ్రమలో రాజకీయాల్లో ఎంతో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడం వల్లే క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: