యంగ్ హీరో సందీప్ కిషన్ తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. 2010 లో వచ్చిన ప్రస్థానం, స్నేహగీతం సినిమాలతో పరిచయమయిన ఈ యంగ్ హీరో... 2011 లో 'షోర్‌ ఇన్‌ ద సిటీ' సినిమాతో బాలీవుడ్ లోను అడుగు పెట్టాడు. అంతేకాదు వరసగా తమిళ సినిమాలలోను నటించి మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. తెలుగులో రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి సినిమాలతో సందీప్ కిషన్ హీరో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. తనవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా సొంత ప్రయత్నాలతోనే అవకాశాలను అందుకుంటున్నాడు. 

 

సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, జోరు, రా రా కృష్ణయ్య, బీరువా, టైగర్, నక్షత్రం ..ఇలా తెలుగు తమిళం లో దాదాపు 25 సినిమాలకి పైగా నటించాడు. సందీప్ కిషన్ నటించిన సినిమాలన్ని మినిమం గ్యారెంటీ సినిమాలుగా నిలబడ్డాయి. ఇక నిను వీడని నీడను నేనే, నెక్స్ట్ ఏంటి సినిమాలతో ప్రయోగాలని చేశాడు. ఎప్పుడైతే సందీప్ కిషన్ ప్రయోగాలని చేయడం మొదలు పెట్టాడో టాలీవుడ్ లో తన క్రేజ్ మరింతగా పెరిగింది. అంతేకాదు మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించాలనుకే నిర్మాతలకి సందీప్ కిషన్ మంచి ఛాయిస్ గా మారాడు. 

 

ఇక సందీప్ కిషన్ లేటెస్ట్ సినిమా ఏ.1 ఎక్స్‌ప్రెస్. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమా మీద ఇండస్ట్రీ వర్గాలలో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటు నరగసూరన్, కచడతపర అనే రెండు తమిళ సినిమాలలోను సందీప్ నటిస్తున్నారు. ఇక ఈ యంగ్ హీరో వెబ్ సిరీస్ లలో నటించడానికి అవి కూడా సిద్దమవుతున్నాడని తాజా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: