సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ మరో కొత్త వివాదానికి తెరలేపారు.  అయితే ఈసారి ఈ వివాదంలోకి ఆ మద్య మిర్యాలగూడలో పరువు హత్య కేసులో భర్తను.. ఈ మద్య తండ్రిని కోల్పోయిన అమృత వచ్చింది. ఈ మద్య రాంగోపాల్ వర్మ వాస్తవిక కథల ఆధారంగా చిత్రాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మర్డర్' చిత్రం ప్రకటనతో మరో వివాదానికి తెరతీశారు.   ఈ చిత్రం అమృత, ప్రణయ్, మారుతీరావుల కథేనని  ప్రచారం జరుగుతోంది. దీంతో, వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి.  ఈ చిత్రం వాస్తవిక ఆధారాలు.. పరవు హత్య నేపథ్యంలో సాగుతుందని ప్రచారం మొదలైంది. అంతే కాదు పోస్టర్ కూడా అమృత ఆమె తండ్రి మారుతీరావు లా కనిపించింది.

 

అంతే ఈ పోస్టర్  చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత అన్నట్టు కథనాలు వచ్చాయి. ఇప్పటికే తాను భర్తను, తండ్రిని కోల్పోయి కృంగిపోతున్నానని.. ఇలాంటి సమయంలో తనను మరింత బాధపట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె అన్నట్లు వార్తలు వచ్చాయి.  అమృత వ్యాఖ్యలకు వర్మ కూడా సమాధానం చెప్పారు. ఈ సినిమా వాస్తవ గాథ ఆధారంగా రూపొందుతుందని చెప్పానే కాని... నిజమైన స్టోరీ అని చెప్పలేదని అన్నారు.

 

తాజాగా ఈ అంశంపై అమృత మామగారు బాలస్వామి స్పందించారు. అమృత పేరిట సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని ఆయన చెప్పారు. వర్మ సినిమాపై అమృత స్పందించలేదని అన్నారు. ఆమె పేరుపై వస్తున్న స్టేట్మెంట్లను నమ్మొద్దని కోరారు. ఇక ఈ చిత్రానికి ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. రామ్ గోపాల్ వర్మ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నట్టి క్రాంతి, నట్టి రుణ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: