హీరో హీరోయిన్స్ విషయంలో అదృష్టం ఒకేలా ఉండదు. హీరోలకు ఒకలా.. హీరోయిన్స్ కు మరోలా ఉంటుంది. సక్సెస్ 
లో ఉంటేనే హీరోలకు క్రేజ్. సాధారణంగా హీరోయిన్స్ కు రిజల్ట్ తో సంబంధం ఉండదు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. ఛాన్సులకు కొదవ ఉండదు. అయితే.. అను ఇమ్మానుయేల్ విషయంలో అదృష్టం రివర్స్ లో నడుస్తోంది. అసలు ఈ పేరే విని చాలా సంవత్సరాలు అయినట్టు ఉంది కదూ. కెరీర్ స్టార్ట్ చేసిన మూడేళ్లలో ఇద్దరు స్టార్స్ తో జతకట్టి మళ్లీ కనిపించలేదు. 

 

అను ఇమ్మానుయేల్ కంటి చూపులో ఏదో గమ్మత్తు ఉంది. ఆ పవర్ తోనే పవర్ స్టార్ ను పడేసింది. ఫారిన్ లో పుట్టిన ఈ మలయాళీ.. గ్లామర్ గా కనిపించేందుకు ఏ మాత్రం వెనుకాడదు. ఇలా హీరోయిన్ సక్సెస్ కు కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నా.. తక్కువ టైమ్ లో తళుక్కున మెరిసి ఫేడౌట్ అయింది అను ఇమ్మానుయేల్. 

 

అను ఇమ్మానుయేల్ కెరీర్ మూడేళ్లు ముచ్చటగా మిగిలిపోయింది. 2011లో మలయాళ చిత్రం స్వప్న సంచారిలో జయరాం కూతురుగా నటించిన అను.. 2016 యాక్షన్ హీరో బిజు మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అదే ఏడాది మజ్ఞుతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ హిట్ కావడంతో.. స్టార్స్ దృష్టిలో పడి అజ్ఞాతవాసిలో పవన్ సరసన.. నా పేరు సూర్యలో బన్నీతో జత కట్టే ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో.. ఆ తర్వాత అను కనిపించలేదు. 

 

ఇలా తన కెరీర్ నాలుగేళ్లకే ఫేడౌట్ అవుతుందని అనుకొని ఉండదు. రాశిఖన్నా.. రకుల్ లాంటి హీరోయిన్స్ ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. కాస్తో గొప్పో ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ పలికించి నటిగా ఫర్వాలేదనిపించుకున్నారు. అయితే.. ఫేస్ లో అమాయకత్వం తప్ప మరే ఎక్స్ ప్రెషన్ పలికించకపోవడం అనూకు మైనస్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: