లాక్‌డౌన్‌ సమయంలో ఎవరికి నచ్చిన పని వాళ్లు చేస్తున్నారు. యంగ్‌  హీరోలైతే సిక్స్‌ ప్యాక్ కు‌ ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి అయితే.. పెసరట్టు.. చేపల ఫ్రై అంటూ వంటల ప్రోగ్రామ్‌ మొదలు పెట్టాడు. ఇక బన్నీ .. మహేశ్‌ అయితే పిల్లలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. రాశిఖన్నా విషయానికొస్తే.. అందరి హీరోయిన్స్‌లా గ్లామరెస్‌ ఫొటోలు పోస్ట్‌ చేయడం లేదు. ఆల్ రెడీ సంగీతంలో ప్రవేశం ఉన్న రాశీ ఖన్నా గిటార్‌ నేర్చుకునే పనిలో బిజీగా ఉంది.

రాశిఖన్నాలో నటి మాత్రమే కాదు సింగర్‌ కూడా దాగి ఉంది.  కెరీర్‌ మొదట్లోనే "జోరు'' మూవీలో టైటిల్‌ సాంగ్‌ పాడి ఆకట్టుకుంది. అప్పటి నుంచి అడపాదడపా పాడుతూనే ఉంది. ప్రతి రోజు పండగేలో 'యు ఆర్‌ మై హై' అంటూ హస్కీ వాయిస్‌తో ఆకట్టుకుంది రాశి.

రాశి సింగింగ్‌ టాలెంట్‌కు మాలీవుడ్‌ కూడా ఫిదా అయింది. మలయాళ  చిత్రం విలన్‌లో థీమ్‌ సాంగ్‌ ఆలపించింది. తను నటించిన సినిమాల్లోనే పాడాతాన్న రూలేమీ పెట్టుకోకుండా.. సాయిధరమ్‌ తేజ్‌, మెహ్రీన్‌ జంటగా నటించిన జవాన్‌ మూవీలో "బంగారం ..' పాట పాడింది రాశి.

రాశిఖన్నా పాడింది నాలుగైదు పాటలే అయినా.. హస్కీ వాయిస్‌తో ఇంప్రెస్‌ చేసింది. మధ్యమధ్యలో ఇంగ్లీష్‌ పదాలు ఉంటే.. తన వాయిస్‌తో మరింత గ్లామర్‌ తీసుకొస్తుంది రాశి.
మలయాళంలో ఒకటి.. తెలుగులో ఐదు పాటలు పాడింది.

ఫ్యూచర్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారుతుందో ఏమోగానీ.. లాక్‌డౌన్‌ టైంలో గిటార్‌ నేర్చుకుంది. ఈ కరోనా టైంలో సంపాదించిన గిటార్‌ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ..  ఉండి పోరాదే శాడ్‌ వెర్షన్‌ పాడి షేర్‌ చేసింది. నిన్నకాక మొన్న నేర్చుకున్నట్టుగా లేకుండా... ప్రొఫెషనల్‌  గిటారిస్ట్‌లా ప్లే చేసింది రాశి. కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోయినా... తనకు ఇష్టమైన సంగీత ప్రపంచంలో విహరిస్తోంది. మొత్తానికి రాశీఖన్నా కరోనా టైమ్ లో కొత్త టాలెంట్ కు పనిచెప్పింది. యాక్టింగ్ తో పాటు.. పాటలు పాడే ఈ బ్యూటీ గిటార్ తో సంగీత ప్రపంచంలో విహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: