ఈ షో స్టార్ట్ అయ్యి వారం అయిపోవడంతో ఫస్ట్ ఎలిమినేషన్ కూడా అయిపొయింది. తమిళ దర్శకుడు సూర్య కిరణ్ ఇంటి నుండి బయటకు వెళ్ళాడు.. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ఈరోజుల్లో ఫేమ్ కమెడియన్ సాయి కుమార్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ మొత్తానికి ఆకర్షణగా నిలిచిన సభ్యురాలు యుట్యూబ్ ఫేమ్ గంగవ్వ..తెలుగు జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలా ఫేమస్ అయిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ లో తన స్టయిల్లో ఆకట్టుకుంటుంది.
బిగ్ బాస్ కు వెళ్లింది అంటే జనాలు మొత్తం ఆమె వెనుక ఉన్నారు. మొదటి వారంలోనే ఆమె ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడంతో భారీగా ఓట్లు పడ్డట్లుగా సమాచారం. కాగా, ఎపిసోడ్ జరగనున్న ప్రోమో లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు.ఒక పడవను హోస్ లో ఉంచి. అందరు అందులోకి ఎక్కి ఆతరవాత ఆ పడవ తీరం చేరిన వెంటనే హారన్ వినిపిస్తుంది . అలా హారన్ వినిపించినప్పుడల్లా ఒకరు దిగిపోవాలని అన్నారు. అలా దిగిన వారు వచ్చే వారం ఎలిమినేషన్ కు నామినేట్ అవుతారని తెలిపాడు బిగ్ బాస్. దాంతో గంగవ్వ ముందుకొచ్చింది. నేను దిగిపోతాను.. నన్ను ఎలిమినేట్ చేయండి అంటుంది. బిగ్ బాస్ లో ఎప్పుడు జరగని రీతిలో ఇలా జరగడం ప్రేక్షకులను ఆలోచనలో పడవేసింది. ఆమెకు హౌస్ లో అంత బాధ ఎందుకు కలిగింది..నిజంగానే ఆమెకు ఇష్టం లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి