ఎన్నికల ప్రచారంలో కనిపిస్తాడు అనుకున్న జూనియర్ ఎన్నికలలో కాదుకదా కనీసం ప్రెస్ మీట్లో కూడ కనిపించక పోవడం జూనియర్ అభిమానులను నిరాశకు గురిచేసాయి. ఈ పరిస్తుతులు చాలవు అన్నట్లు లేటెస్ట్ గా జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే నందమూరి అభిమానులలో ఒక ప్రధాన వర్గం జూనియర్ కు దూరంగా జరిగిపోతొందా అనే అనుమానాలను రేకేత్తిస్తునాయి. ఒక వైపు ఈరోజు ఉదయం నుండి తెలుగుదేశం కేడర్ భాగ్య నగరంలో జరుగుతున్న ‘మహానాడు’ లో మంచి హుషారుగా ఉంటే జూనియర్ ‘రభస’ ఆడియో పోస్టర్లకు రాష్ట్ర వ్యాపతంగా నిన్న రాత్రి జరిగిన అవమానం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. నిన్న ఉదయం నుండి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలోని ప్రముఖ సెంటర్లలో అంటించబడ్డ జూనియర్ ‘రభస’ ఆడియో పోస్టర్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి చింపి వేయడం బట్టి చూస్తూ ఉంటే జూనియర్ సినిమాలను అవమాన పరచడానికి ఒక పక్కా ప్లాన్ అమలుజరుగుతోంది అని విశ్లేషకులు అంటున్నారు. ‘రభస’ ఆడియో పోస్టర్లకు ఈ పరిస్థితి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో జరగడం బట్టి జూనియర్ శత్రు వర్గం బాగా బలపడుతోంది అన్న విషయాన్ని జూనియర్ అభిమానులే చెపుతున్నారు. ఈ పరిస్థుతులు ఇలాగే కొనసాగితే రాబోతున్న రోజులలో జూనియర్ సినిమాలను చూసే అభిమానులు కూడ తగ్గిపోయి అది జూనియర్ కెరియర్ కు పెద్ద సమస్యగా మారే అవకాసం ఉంది అని అంటున్నారు. ఈ పరిస్థుతులలో జూనియర్ తన అభిమానులలో ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ లో తన పట్టు సడల కుండా చూసుకోవాలి అంటే ఏదోవిధంగా బాలయ్యతో సద్దు బాటు చేసుకోవాలని జూనియర్ ను విపరీతంగా ఆరాధించే ఆయన అభిమానులే సూచనలను చేస్తున్నారని టాక్. ఈ పరిస్థుతుల నేపధ్యంలో తన తాత పార్టీ తెలుగుదేశం మహానాడులో జూనియర్ కనీసం కనిపించి పెరుస్తాడెమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: