ఒక్కొక్క సారి మనకు తెలియకుండానే మనం వేసిన జోక్ మనకు శాపంగా మారుతుంది అంటారు.   ఇప్పుడు అలంటి సందర్భం నటుడు బ్రహ్మజీకి ఎదురై అతడిని సమస్యలలో పడేసింది. ఈ అనుకోని సమస్యలతో బ్రహ్మాజీ ఏకంగా తన సోషల్ మీడియా ఎకౌంట్ ను డిలీట్ చేయావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో బ్రహ్మజీ అనవసరంగా టార్గెట్ అయ్యాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


హైదరాబాద్ పై వరుణు డు పగ పట్టడంతో ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా వర్షాలు వస్తున్నాయి. దీనితో భాగ్యనగరం వరదలలో చిక్కుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా చాల చోట్ల ప్రజలను వరదల సమస్య వెంటాడుతూనే ఉంది. హైదరాబాద్ ను అతలా కుతలం చేస్తున్న వరదలపై తనదైన స్టయిల్ లో బ్రహ్మాజీ వేసిన జోక్ వైరల్ గా మారింది.  


‘ఓ మోటారు బోటు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎవరైనా సలహా ఇవ్వండి" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు వాస్తవానికి బ్రహ్మాజీ దృష్టిలో ఇది కేవలం ఒక చిన్న సెటైర్ మాత్రమే. అయితే వరదలతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఈ జోక్ వేరే విధంగా అర్ధం అవ్వడంతో కొంతమంది బ్రహ్మాజీని తెలంగాణ ద్రోహి అంటూ విమర్శలు చేస్తున్నారు.


ఈ ఊహించని పరిణామానికి షాక్ అయిన బ్రహ్మజీ తాను అలాంటి కామెంట్స్ ఎందుకు చేయవలసి వచ్చిందో వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈమధ్య కురిసిన భారీ వానలకు బ్రహ్మాజీ అపార్ట్ మెంట్ లోకి కూడా నీళ్లు వచ్చాయి. కారు సెల్లార్ లోకి వెళ్లలేకపోయింది. దీనితో బ్రహ్మాజీ అతడి కొడుకుని దగ్గర్లోని మరో అపార్ట్ మెంట్ లో కారు పార్క్ చేయించాలని ప్రయత్నించినా అది వరదలు వల్ల సాధ్యం కాలేదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను జోక్ చేసాను తనకు వేరే ఉద్దేశ్యం లేదు అంటూ బ్రహ్మాజీ వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏమైనా బ్రహ్మాజీ జోక్ వికటించడం దురదృష్ట కరం..

మరింత సమాచారం తెలుసుకోండి: