బిగ్ బాస్ సీజన్ 4లో 8వ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అన్నది చూస్తే.. ఈ వారం నామినేషన్స్ లో అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మా రాజశేఖర్, లాస్య ఉన్నారు. వీరిలో అరియానా, అఖిల్, లాస్య సేఫ్ జోన్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. అఖిల్ తన ఆటని ఇంకా మెరుగుతు పరచుకోవాల్సి ఉంది. హౌజ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా అఖిల్ గేమ్ ఆడాలని చూస్తున్నాడు.

ఇక లాస్య కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో ఆమెను కూడా నామినేషన్స్ నుండి సేఫ్ అయ్యేలా చేస్తారు. ఇక అరియానా ది ఫైటర్ అనేలా ప్రతి వారం తనని నామినేట్ చేస్తున్నా సరే ఆమె సేవ్ అవుతూ వస్తుంది. తప్పకుండా నామినేషన్స్ లో అరియానా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ముగ్గురు సేవ్ గా ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో చూస్తే మెహబూబ్, మోనాల్, అమ్మా రాజశేఖర్ ఉన్నారని చెప్పొచ్చు. ఈ ముగ్గురిలో ఎక్కువగా అమ్మా రాజశేఖర్ కే ఎఫెక్ట్ పడేలా ఉంది.

తప్పకుండా ఇక ఒకవేళ దివి ఫ్యాన్స్ అమ్మాని కాపాడాలని అనుకుంటే మాత్రం అమ్మా సేవ్ అవుతాడు. అలాంటి టైం లో మెహబూబ్, మోనాల్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మెహబూబ్ ఈమధ్య టాస్కులు సూపర్ ఆడుతున్నాడు. తప్పకుండా అతను సేవ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే అరియానా అతన్ని లాస్ట్ వీక్ సేవ్ చేసినా సరే అతను కావాలని ఈ వారం కూడా ఆమెను నామినేట్ చేయడంపై మెహబూబ్ పై కొద్దిపాటి నెగిటివిటీ వచ్చింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: