అలాగే నటుడు హృతిక్ రోషన్‌తో తనకు ఉన్న సంబంధం గురించి మాట్లాడవద్దని అక్తర్ తనను బెదిరించారని కంగనా వ్యాఖ్యానించిందిది. కంగనా రనౌత్ ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూను లక్షల మంది చూశారని, ఇది తన ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని అక్తర్ వాదించారు. పరువు నష్టం దావాను విచారణకు స్వీకరించి తగు న్యాయం చేయాలని జావేద్ అక్తర్ కోర్టును కోరారు.
బాలీవుడ్ వివాదాస్పద భామ ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే పేరు కంగనా రనౌత్. నటనలో జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. వివాదాలతో వార్తల్లో ఉండటం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నైజం. బీ టౌన్‌లో ఏ వివాదం జరిగినా వెంటనే రియాక్ట్ అవ్వడంలో స్పెషలిస్ట్. ఈమె గారి నోటి దురుసుకు బాలీవుడ్ బడా బాబులు అంతా షేక్ అవుతారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం తర్వాత కంగనా మరో సారి యాక్టివ్ అయింది.
బాలీవుడ్ లో నెపోటిజం అంటూ బాంబులు వేసి సీనీ పెద్దల్ని ఓ ఆటాడుకుంది. బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువని.. అయినవాళ్లపై ప్రేమతో సుశాంత్ లాంటి టాలెంటెడ్ హీరోలకు ఛాన్స్‌లు రాకుండా చేస్తున్నారని విరుచుకుపడింది. సుశాంత్ మరణానికి కరణ్ జోహార్, మహేశ్ భట్, బాలీవుడ్ టాప్ హీరోలే కారణమని ముక్కుసూటిగా చెప్పింది. సుశాంత్ కేసులో రియా డ్రగ్స్ లింకులు బయటపడగానే తాను కూడా బాధితురాలినే అని చెప్పుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి