థియేటర్ల ఓపెనింగ్ ఇష్యూ సీరియస్ నెస్ ను.. ప్రభుత్వాలు అస్సలు గుర్తించడం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రేక్షకులు థియేటర్ల వైపే చూడకపోవడంతో సినిమా హాళ్ల మనుగడ ప్రశ్నార్ధకమైంది.ఈ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం ఇప్పటికే కొందరు టాప్ హీరోలు తమ వంతు ప్రయత్నంగా తామే థియేటర్లకు వెళ్లి సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరిని ఫాలో అవుతూ మిగతా హీరోలు కూడా థియేటర్లకు క్యూ కడతారంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనలు పాటిస్తూ సినిమా హాళ్లు ఓపెన్ అయ్యాయి. అయితే మార్గదర్శకాలతో ఓపెన్ అయిన థియేటర్ల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఇదే పద్దతిలో థియేటర్ల వ్యవస్థ రన్ అయితే గనుక.. కొన్ని రోజుల్లో హాళ్లు మూసుకొని కళ్యాణ మండపాలు కట్టుకోవల్సిందే. అందుకే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు టాప్ హీరోలు థియేటర్ల వ్యవస్థకు పూర్వ వైభవం వచ్చేలా ప్రమోషన్లు చేయాలని పలువురు మేథావులు అభిప్రాయపడుతున్నారు. గేమ్ చేంజర్ మూవీలొస్తే ఆడియన్స్ నుంచి మూమెంట్ వస్తుందని భావిస్తున్నారు.

ఇప్పుడున్న సమయంలో సినిమా హాళ్లకు ఆడియన్స్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా భయం వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. దీంతో కొందరు స్టార్ హీరోలు,దర్శకులు ఫీల్డ్ లోకి దిగి ప్రమోషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ థియేటర్ల వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగా "టెనెట్" సినిమాను థియేటర్లోనే చూసి ఎంతోమంది సెలబ్రెటీలకు ఆదర్శంగా నిలిచాడు. టామ్ చేసిన ఈ పనికి ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్  ఈ యాక్షన్ హీరోని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.

హాలీవుడ్ స్టార్ చేసిన ఈ పని మొన్న సమ్మర్లో జరిగింది. ఇప్పుడు ఇదే పని మన మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చేశాడు. ముంబై జుహూలో పివిఆర్ సినిమాస్ లో "సూరజ్ పె మంగల్ భారీ"ఫిలిం చూశాడు.అంటే మల్టిఫ్లెక్స్ లో సినిమాను ఎంకరేజ్ చేశాడు. కుదిరితే త్వరలో సినిమా హాళును సందర్శించి ఏదో ఒక ఫిలింను చూడాలని కోరుకుంటున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: