హీరోయిన్ రవళి నిన్నటి తరం నటీమణి. హీరోయిన్స్ జీరో సైజు ఉండాలనుకునే సమయంలో బొద్దు అందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది. మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ అంటూ చూపులు తిప్పుకోకుండా చేసిన నటి రవళి. గుడివాడలో పుట్టిన రవళి అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ మలయాళంలో మొదట తన సినీ కెరీర్ ని ప్రారంభించింది.రవళి అస్సలు పేరు శైలజ. తెలుగు సినిమాల కోసం రవళి గా పేరు మార్చుకోగా, మలయాళ సినిమాల కోసం అప్సర గా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇక టాలీవుడ్ లో అలీ హీరోగా నటించిన అరడజను దొంగలు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా రవళి కి మంచి గుర్తింపును ఇచ్చింది. ఒరేయ్ రిక్షా, పెళ్లి సందడి, వినోదం వంటి సినిమాల్లో అల్లరి అమ్మాయిగా రవళి కి గుర్తింపు లభించింది.

రవళి కుటుంబం అంతా నటులే

బయట చాల మందికి తెలియని విషయం ఏంటి అంటే ఆమె కుటుంబంలో చాల మంది నటులు ఉన్నారని. రవళి అక్క హరిత సైతం హీరోయిన్ అవ్వాలని మొదట సినిమాల్లో నటించింది. అక్కడ సరైన గుర్తింపు రాకపోవడంతో పెళ్లి చేసుకొని బుల్లి తెరపై చాల బిజీ యాక్ట్రెస్ అయ్యింది. హరిత ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీ లో పెద్ద యాక్టర్ గా చలామణి అవుతుంది.ఇక హరిత భర్త జాకీ సైతం సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. రవళి, హరితలకు ఒక అన్నయ్య సైతం ఉన్నాడు. అతడి పేరు విజయ్. ఈయన తెలుగులో కంటే తమిళ్ లో చాల పాపులర్. ఇక్కడ కొన్ని సినిమాల్లో నటించిన తమిళ్ లో మాత్రం అనేక సినిమాల్లో నటిస్తూ సీరియల్స్ లో సైతం మెరుస్తున్నాడు. ఇక ఒక్క నటనే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఒక సినిమా చేసాడు విజయ్. ఇక రవళి ప్రస్తుతం ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకొని చెన్నై లో సెటిల్ కాగా ఆమెకు ఇద్దరు కుమార్తెలు.

మరింత సమాచారం తెలుసుకోండి: