ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... శృతి హాసన్ ప్రియుడు మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో అతనితో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే...అతనితో బాగా ప్రేమలో మునిగితేలిన శృతి హాసన్ కొన్ని రోజులపాటు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. సినిమాలకు  దూరంగా ఉండి మళ్ళీ  ఇటీవలే కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అతనితో బ్రేకప్ చేసుకున్న ఈ బ్యూటీ.. వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మళ్ళీ సినిమాలు చేస్తూ హీరోయిన్  గా బిజీ అయ్యి మునుపటి వైభవం కోసం ఎదురు  చూస్తోంది. ఈ మేరకు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్, దానిపై ట్యాగ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ  వైరల్‌ అవుతుంది.

నిర్మాత, రచయిత అయిన  ర్యాన్‌ ఇవాన్‌ స్టీఫెన్ లుంగీ దొంగిలించి.. ఆ లుంగీతో ఫోటోలకు ఫోజిచ్చింది శృతి హాసన్. నీళ్లలో దిగి హాఫ్ బికినీలో అలా ఎంజాయ్ చేస్తున్న ఆమె.. స్వయంగా ఈ పిక్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ లుంగీ స్టీఫెన్‌ది అని చెబుతూ ఆయనకు సారీ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ జత చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కువగా నలుపు దుస్తుల్లోనే కనిపించే శృతి.. ఈ ఫోటోపై 'కొన్ని సెలవులు ఇలా రంగులతో ఎంజాయ్ చేస్తా' అని ఆ పోస్ట్ లో మెన్షన్ చేసింది..


ఇక ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది... గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.గతంలో వీరి కాంబినేషన్ లో బలుపు సినిమా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్ కం బ్యాక్ కోసం ఈ ముగ్గురు ఎదురు చూస్తున్నారు...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: