అంగరంగ వైభవంగా జరిగిన నాగబాబు ముద్దుల కుమార్తె
నిహారిక పెళ్లి వేడుక.. కాసేపటి క్రితమే
నిహారిక,
చైతన్య జొన్నలగడ్డ బంధుమిత్రుల సమక్షంలో
ఉదయ్ పూర్ లో వివాహ బంధం తో ఒకటయ్యారు.. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూసిన తరుణం రానే వచ్చేసింది.. ఆకాశమే పందిరిగా ,భూలోకమే వేదికగా
మెగా ఫామిలీ కి చెందిన మెగా బ్రదర్ నాగబాబు గారి గారాల పట్టి
నిహారిక వివాహ కార్యక్రమం పూర్తి అయ్యింది .. కరోనా సమయంలో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట ఈరోజు వేదపండితుల మంత్రాల సాక్షిగా
చైతన్య జొన్నలగడ్డ
నిహారిక మెడలో మూడుముళ్లు వేశారు.. తాజాగా ఈ జంట
పెళ్లి ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి ..

నిహారిక
పెళ్లి కోసం కుటుంబమంతా
రాజస్థాన్ లోని
ఉదయపూర్ ప్యాలెస్ కి తరలి వెళ్లారు...ఇక పెళ్ళికి పది రోజుల నుంచి మెగా డాటర్
నిహారిక పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి .. ఈ
పెళ్లి వేడుకకి ఇరు కుటుంబాలకు చెందిన వారి తో పాటు కొంతమంది అతిథులుగా కూడా హాజఋ కావడం విశేషం .. నిహారిక పెళ్లిలో మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి ,
పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు ఫ్యామిలీ సందడి చేశారు.. అంతే కాదు పెళ్లికి ముందు ఏర్పాటుచేసిన సంగీత్ లో వివిధ పాటలకు
చిరంజీవి డాన్స్ లుకూడా చేసారు ..నిహారిక
పెళ్లి వేడుకలు మెగా ఫ్యామిలీ తో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు హాజరైయ్యారు.. కరోనా కారణంగా సినీ
హీరోయిన్స్ ని పెద్దగా పిలవక పోవడం విశేషం .. ఈనెల 11 వ తేదీన బంధుమిత్రుల కోసం
హైదరాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్లు మెగా ఫ్యామిలీ తెలిపింది.. ఇక వరుడు
చైతన్య గురించి చెప్పాలంటే ఇతడు గుంటూరు ఐజి
ప్రభాకర్ రావు గారి కుమారుడు ..