ప్రభాస్ సలార్ సినిమా కూడా నేషనల్ వైడ్ రిలీజ్ అవనుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా స్టార్ హీరోలు ఇద్దరు నటిస్తారని టాక్. అందులో ఒకరు మోహన్ లాల్ కాగా మరొకరు రానా అని తెలుస్తుంది. బాహుబలి సినిమాలో భళ్లాలదేవాగా మెప్పించిన రానా మరోసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అని తెలుస్తుంది. అంతేకాదు మళయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ప్రభాస్ సలార్ లో ఉంటాడని తెలుస్తుంది. ఈ ఇద్దరు ఉంటే ప్రభస్ సలార్ కు మరింత క్రేజ్ వస్తుందని చెప్పొచు.
కె.జి.ఎఫ్ కు ముందు యశ్ ఎవరో తెలుగు ఆడియెన్స్ కు తెలియదు అలాంటి యశ్ తోనే కె.జి.ఎఫ్ లాంటి సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టరే అదుర్స్ అనిపించగా సినిమా వేరే లెవల్ లో ఉంటుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి