ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో ఒదిగిపోయి మరి నాచురాలిటీ ఎంతో దగ్గరగా ఉండే విధంగా తరుణ్ భాస్కర్ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తే ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా ఒక సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా అంతగాప్రేక్షకులను అలరించలేకపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకసారి దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన తరుణ్ భాస్కర్.. జబర్దస్త్ షో గురించి మాట్లాడారు. జబర్దస్త్ షో చూసిన తర్వాత వీళ్ళు ఏంటి ఇలా జోకులు వేస్తున్నారు నాకు నవ్వు రావడం లేదు అని అనుకునేవాడిని కానీ ఎప్పుడైతే నేను జబర్దస్త్ లోకి జడ్జిగా వెళ్ళానో అక్కడ వారు పడే కష్టాన్ని.. వేసే జోకులను ఎంతగానో ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. 10 నిమిషాల టైం లోనే స్కిట్ రాసుకోవడం ప్రాక్టీస్ చేయడం కెమెరా ముందుకు రావడం లాంటివి చేస్తారని.. జబర్దస్త్ లో కమెడియన్స్ లాగా తాను ఎప్పటికీ చేయలేను అంటూ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి