మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది క్రాక్. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజైన క్రాక్ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది. కరెక్ట్ సినిమా పడితే మాస్ మహరాజ్ రవితేజ స్టామినా ఏంటో అందరికి తెలిసిందే. రాజా ది గ్రేట్ తర్వాత హిట్ కోసం తపిస్తున్న రవితేజకు క్రాక్ ఆ కోరిక నెరవేర్చేలా ఉంది. క్రాక్ ట్రైలర్ 24 గంటల్లో 7 మిలియన్ వ్యూస్ సాధించింది అంటే రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఎంత క్రేజీగా ఉన్నారో అర్ధమవుతుంది.

తప్పకుండా ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్ అందరికి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. సంక్రాంతికి నాలుగు రోజులు ముందే తన ఫ్యాన్స్ కు పండుగ జోష్ తెచ్చేలా ఉన్నాడు రవితేజ. మాస్ మహరాజ్ తన ఇమేజ్ కు తగినట్టుగా తెరకెక్కిన ఈ క్రాక్ సినిమా ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరి ఈ ఊపు, ఉత్సాహం చూస్తుంటే మాస్ రాజా తిరుగులేని హిట్ కొట్టేలా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా న్యూ ఇయర్ కు రిలీజైంది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: