ప్రశాంత్ నీల్ సలార్ ఫిలిం మ్యాటర్ లో... అంతకుమించి ఆలోచించలేకపోతున్నాడేమో అనిపిస్తుంది.ఏం చెప్పినా మాటకు ముందు వెనకాలా కేజిఎఫ్ పేరే ప్రస్థావనకు తెస్తున్నాడు. చివరకు తన తర్వాతి ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదే పాట లూప్ వేయడంతో సలార్ పై లేనిపోని అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ ప్రాంఛైజీతో నేషనల్ వైడ్ ఫుల్ పాపులరైన దర్శకుడు. కేజిఎఫ్-1 సూపర్ హిట్ కావడంతో కేజిఎఫ్ 2తోను హిట్ కొడతానని భీష్మించుకు కూర్చున్నాడు. నీల్ లోని ఈ గట్స్ నచ్చే సౌత్ హీరోలు మనోడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

తన తర్వాతి ప్రాజెక్ట్ సలార్ ను ప్రభాస్ తో కమిట్ అయ్యాడు. ఈ ఫిలింను త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్తున్నాడు.అయితే ఈ ఫిలింకు ప్రశాంత్ నీల్ తీసుకునే టెక్నీషియన్స్ మ్యాటర్ కాస్త గట్టిగా ట్రోల్ అవుతుంది. కేజిఎఫ్ టీంనే దింపేశాడనే మాట కన్నడ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది.కేజీయఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్  ఇచ్చిన రవి బస్రుర్ ను  ఈ ప్రాజెక్ట్ కు కంటిన్యూ చేస్తున్నాడని చెబుతున్నారు.

ప్రశాంత్ నీల్ సేమ్ టీంను ఇక్కడ వాడుకునేలా కనిపించడంతో టెక్నీషియన్స్  ఒక్కటేనా ...లేక స్టోరీ కూడా ఆ సినిమాదేనా అన్నట్లుగా  కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే తన ఫస్ట్ ఫిలిం ఉగ్రంను కూడా కాస్త అటు ఇటుగా కేజిఎఫ్ లో ఇరికించేశాడు. అంటే స్టోరీ విషయంలో అంత తోపు కానప్పుడు మళ్లీ అదే రిపీట్ కావచ్చనే చిన్న అనుమానం రోజు రోజుకు పెరిగిపోతుంది. చూద్దాం.. సలార్ టీజర్ వస్తే గానీ కేజిఎఫ్ ఫ్లేవర్ సినిమాలో ఎంతుందో గానీ తెలియదు.

మొత్తానికి మనోళ్లు ప్రశాంత్ నీల్ తో కలిసి పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎలాగైనా ఆ దర్శకుడితో పనిచేసి సక్సెస్ కొట్టాలని ఆరాటపడుతున్నారు. చూద్దాం ప్రశాంత్ నీల్ తర్వాతి ప్రాజెక్ట్ ఎలా సక్సెస్ అవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: