ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కోలీవుడ్ స్టార్  హీరో విజయ్ క్రేజ్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.ప్రపంచం అంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నార్త్ లోను విజయ్ కి బాగా క్రేజ్ ఉంది. అతని సినిమా ఎలా వున్న ఎంత నెగటివ్ టాక్ తెచ్చుకున్న కేవలం తన క్రేజ్ తో తన స్టామినా తో కలెక్షన్స్ రాబట్టగలడు. తాజాగా విజయ్ నటించిన చిత్రం ‘మాస్టర్’. ‘ఖైదీ'(2019) ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా  సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యింది. సినిమాకి హిట్ టాక్ అయితే ఏమీ రాలేదు కానీ.. మొదటి నుండీ ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ తో కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్లో నమోదయ్యాయి. విజయ్ సేతుపతి వంటి క్రేజ్ ఉన్న హీరో ఈ చిత్రంలో విలన్ గా నటించడంతో ఈ చిత్రం పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 3రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను సాధించిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేసిందంటే నైజాంలో 3.33 కోట్లు,సీడెడ్ 2.47 కోట్లు, ఉత్తరాంధ్ర 2.16 కోట్లు, ఈస్ట్ 1.13కోట్లు, వెస్ట్ 1.12కోట్లు,కృష్ణ 1కోటి,గుంటూరు 1.23కోట్లు,నెల్లూరు 0.59 కోట్లు,టోటల్ గా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలు కలిపి 13.03 కోట్లు కలెక్ట్ చేసింది మాస్టర్ సినిమా..తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 13.03 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 4.03 కోట్ల వరకూ లాభాలను తీసుకోచ్చింది ఈ సినిమా. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: