ఇన్నాళ్లు సీరియల్స్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చిన రంగస్థల కళాకారుడు గోపరాజు రమణ ఒక్క సినిమాతో టాలీవుడ్ మొత్తం అతని గురించే మాట్లాడుకునేలా చేశాడు. వినోద్ అనంతోజు డైరక్షన్ లో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో తండ్రి కొండలరావు పాత్రలో అదరగొట్టాడు గోపరాజు రమణ. ఆ పాత్ర ఆయన చేసిన విధానం చూస్తే నిజంగా కొండలరావు అనే వ్యక్తి ఉంటే అచ్చుగుద్దినట్టు ఇలా ఉంటాడా ఇలానే చేస్తాడా అన్న రేంజ్ లో నటించాడు.

సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఆనంద్, వర్షలు హీరో, హీరోయిన్స్ అయినా సినిమా హిట్ అయ్యింది అంటే అది అతని వల్లే అన్నంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అసలు సినిమాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేని గొపరాజు రమణ సీరియల్స్ లోనే తన కెరియర్ సాగిస్తున్నాడు. బాగా తెలిసిన వారే అయినా సిల్వర్ స్క్రీన్ కు కొత్తగా పరిచయం అవడం అది కూడా కొత్త పాత్రలో కనిపించడం ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. అందుకే అతనికోసం కొత్త కొత్త పాత్రలు రాస్తున్నారట.

మిడిల్ క్లాస్ మెలోడీస్ లో గోపరాజు రమణ నటన చూసి చాలా పెద్ద పెద్ద స్టార్స్ అవకాశాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా ఎఫ్3 సినిమాలో వెంకటేష్ తండ్రి పాత్రలో గోపరాజుకి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగులో ఎస్వి. రంగారావు, కోటా శ్రీనివాస్ రావు తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టులు తక్కువయ్యారు. అందుకే గోపరాజు రమణ లాంటి వారిని ఎంకరేజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎఫ్3 తో పాటుగా మరికొన్ని సినిమాల్లో గోపరాజు రమణ నటిస్తున్నట్టు తెలుస్తుంది.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: