
పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికి ఆశించిన స్థాయిలో ఈ సినిమా పై హైప్ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనుంది చిత్రబృందం. అయితే ఈ చిత్రానికి ఎవరు ఊహించని విధంగా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇవి చూసి ఒకింత పవన్ అభిమానులే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకీ అదేమిటంటే ఈ సినిమాను పలువురు ఉత్తరాది బీజేపీ నాయకులు కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమా భారీ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు ఎప్పుడు లేనిది పవన్ సినిమాకు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రమోషన్ చెయ్యడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. మరి దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.. ఇక ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ జాగర్లమూడి తో ఓ సినిమా, అలాగే రానా తో కలిసి మలయాళ సూపర్ హిట్ " అయ్యపనం కొషియమ్ " సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇవే కాక మరో మూడు ప్రాజెక్ట్ లు లైన్లో ఉన్నాయి.