ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఒక ఉన్నతమైన శిఖరాన్ని అందుకోవాలంటే ఫస్ట్ ఒక్క అడుగుతో పయనం మొదలు పెట్టాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ గా స్టేటస్ పొందాలంటే మొదటి సినిమాతోనే ఆకట్టుకోవాలి.ఇక ఫిబ్రవరి 12 న  విడుదలైన ఉప్పెన చిత్రం ఎబౌవ్ యావరేజ్ టాక్ తోనే రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. దీనికి కారణం ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ హిట్ అవ్వడం. దాంతో సినిమా పై విపరీతమైన హైప్ ఏర్పడడం అనే చెప్పాలి. ఏదైతేనేం ఉప్పెన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది అనే చెప్పొచ్చు. దీంతో డెబ్యూ మూవీతోనే మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన హీరోగా చరిత్ర సృష్టించాడు వైష్ణవ్ తేజ్. అంతకు ముందు ఈ రికార్డ్ అక్కినేని అఖిల్ పేరుతో ఉండేది.ఇదిలా ఉండగా … తెలుగు రాష్ట్రాల్లో మొదటి సినిమాతో మొదటి రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ ను   రాబట్టిన మన హీరోలు ఎవరో చూడండి...

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ప్రస్తుతం ఈ రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు.ఉప్పెన చిత్రం మొదటి రోజు 9.3 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక రెండవ స్థానంలో టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ వున్నాడు.వి వి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన అఖిల్ చిత్రంతో ఇతను మొదటి రోజు 7.6 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక మూడవ స్థానంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వున్నాడు.చిరుత చిత్రంతో ఇతని మొదటి రోజు 3.75 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక  మరో మెగా తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నాలుగవ స్థానంలో వున్నాడు.ముకుంద చిత్రంతో ఇతను మొదటిరోజు 3.36 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక ఐదవ స్థానంలో ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీనివాస్ వున్నాడు.అల్లుడు శీను చిత్రంతో ఇతను మొదటి రోజు 2.86 కోట్ల షేర్ ను రాబట్టాడు..

ఇక ఆరవ స్థానంలో కింగ్ నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య వున్నాడు.జోష్ చిత్రంతో ఇతను మొదటి రోజు 2.60 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక ఏడవ స్థానంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వున్నాడు.పిల్ల నువ్వులేని జీవితం .. చిత్రంతో మొదటి రోజు ఇతను 2.30 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక ఎనిమిదవ స్థానంలో దగ్గుబాటి వారసుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు రానా వున్నాడు.లీడర్ చిత్రంతో ఇతను మొదటి రోజు 1.7 కోట్ల షేర్ ను రాబట్టాడు.జయం చిత్రంతో నితిన్ మొదటి రోజు 1.2 కోట్ల షేర్ ను రాబట్టి తొమ్మిదవ స్థానంలో వున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు చిత్రంతో  మొదటి రోజు 1కోటి పైనే షేర్ ను రాబట్టి పదవ స్థానంలో వున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: