ప్రస్తుతం
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో
మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లే ఎక్కువ. అలా
ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో నాచురల్ స్టార్
నాని కూడా ఒకరు.
నాని అసిస్టెంట్
డైరెక్టర్ గా కెరీర్ ను మొదలు పెట్టి హీరోగా
టాలీవుడ్ లో సెటిల్ అయ్యారు.
నాని అష్టా చెమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ సినిమాలో
నాని నటనకు మంచి గుర్తింపు రావడంతో ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక
నాని ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటుండగా ఆయన చిరు హోస్ట్ గా ఉన్న సమయంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు వెళ్లిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో
నాని స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు తనకు జరిగిన ఓ సంఘటన ను షేర్ చేసుకున్నాడు.
నాని చిన్నప్పుడు ఆయన కుటుంబం అమీర్ పేట్ లో నివాసం ఉండేవారట. ఆ సమయం లో
మెగాస్టార్ మాస్టర్ సినిమా విడుదలవ్వగా
నాని ఆ
సినిమా చూడ్డానికి తన కొత్త
సైకిల్ ను తీసుకెళ్లారట. అక్కడ టికెట్ కౌంటర్ వద్ద జనాలు ఎక్కువగా ఉండటం తో
సైకిల్ ను పక్కన పార్క్ చేసి టికెట్ కోసం లైన్ లో నిలుచున్నారు.
నానికి టికెట్ అయితే దొరికింది కానీ
సైకిల్ మాత్రం ఎవరో ఎత్తుకెళ్లారట. టికెట్ తీసుకోవాలన్న తొందరలో
నాని సైకిల్ కు తాళం వెయ్యడం మర్చిపోయారు దాంతో
సైకిల్ ను ఎవరో ఎత్తుకెళ్లారు.
సైకిల్ పోయినా
నాని మాత్రం టికెట్ దొరికిన సంతోషం లో
సినిమా చూసేసారట. అయితే సినిమాకు శుభం కార్డు పడే సమయానికి నానికి
సైకిల్ పై మళ్లీ టెన్షన్ మొదలయ్యిందట. ఇక ఈ స్టోరిని
నాని మూడేళ్ళ క్రితం మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో చిరుకు చెప్పారు. అంతే కాకుండా తన పోయిన
సైకిల్ కు బదులుగా
సైకిల్ ను
గిఫ్ట్ గా ఇవ్వాలని
మెగాస్టార్ ను కోరారు. ఈ స్టోరీ విన్న చిరు గట్టిగా నవ్వేశారు. కానీ
సైకిల్ మాత్రం నానికి
గిఫ్ట్ గా ఇచ్చారు.
నాని ది సాధారణ
సైకిల్ కాగా
మెగాస్టార్ గేర్ ల
సైకిల్ ను
గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని
నాని తన సోషల్ మీడియాలో షేర్ చేసి అప్పట్లో ముచ్చట పడ్డారు. ఇక ఈరోజు
నాని బర్త్ డే సందర్భంగా ఈ వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది.