గత 5 సంవత్సరాలుగా సరైన హిట్ లేక బాధ పడుతున్న తాప్సీకి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గంగ' టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడ సూపర్ హిట్ కావడంతో కోలీవుడ్ లో మళ్ళీ తాప్సీకి అవకాశాలు వస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల మహేష్ తో తీస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కూడ ఒక హీరోయిన్ గా తాప్సీని ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ చర్చలలో ఉన్నాయి అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి.

అయితే తన సినిమా అవకాశాలు గురించి పట్టించు కోకుండా తాప్సీ పెళ్ళి పనులలో బిజీగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పెళ్ళి పనులు వేరు. తాప్సీ త్వరలోనే ‘వెడ్డింగ్ ప్లానర్’ గా మారబోతోంది. ఎప్పటి నుంచో వ్యాపారాలు చేద్దామనే అభిలాషతో ఉన్న తాప్సీ ఒక వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ ను స్థాపించబోతోంది. 

తాప్సీ తన చెల్లెలు షగున్‌, స్నేహితురాలు ఫరాతో కలిసి ‘వెడ్డింగ్‌ ప్లానింగ్‌’ కంపెనీని త్వరలో లాంఛ్‌ చేస్తోంది. తనకి ఈ రంగం మీద ఆసక్తి ఉందని, తన స్నేహితురాలు ఫరాకి ఇందులో అనుభవం ఉందని, అందుకే ఇప్పుడు దీనిలో ఇన్వెస్ట్‌ చేస్తున్నానని తను యాక్టివ్‌ కాకపోయినా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటానని చెపుతోంది తాప్సీ. 

అంతేకాదు  త్వరలో  ఈ కంపెనీ తరఫున ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా స్టార్ట్‌ చేస్తామని అంటోంది. ఈమధ్యేనే కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కాంచన చిత్రానికి హిందీలో కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాలని నిర్ణయించుకున్న తాప్సీ ఇలా కొత్త వ్యాపారాలను కూడా పెడుతూ తన కెరియర్ పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని అనుకోవాలి. మరి సినిమాలలో పెద్దగా రాణించని తాప్సీ వ్యాపారాలలో సక్సస్ ను పొందుతుందని ఆశిద్దాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: