అయితే లూసిఫర్ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతు ఉండగా వేదాళం రీమేక్ మెహర్ రమేష్ తెరకెక్కించబోతునట్లు తెలుస్తోంది. అదే సమయంలో యంగ్ డైరెక్టర్ బాబితో మరో సినిమా చేసేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారట. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది . అయితే వేదాళం రీమేక్ సినిమా కంటే ముందే యువ దర్శకుడితో సినిమాను తెరకెక్కించేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా పట్టా లెక్కించేందుకు అన్ని పనులు పూర్తి చేస్తుందట చిత్రబృందం.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై కూడా దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ శృతిహాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోండగా.. ఇప్పుడు మరో పేరు కూడా ఈ లిస్టులో వచ్చి చేరింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సోనాక్షి సిన్హా. మెగాస్టార్ సినిమా లో నటింపజేసేందుకు సోనాక్షి సిన్హ తో దర్శకుడు బాబి చర్చలు జరుపుతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. మరి మెగా స్టార్ సినిమాకు ఈ బాలీవుడ్ బ్యూటీ ఒప్పుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి