ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన దేశంలో చాలా దారుణంగా విజృంభిస్తుంది. రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఎన్నో మరణాలు జరుగుతున్నాయి. ఇక కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైన తర్వాత నిరంతరంగా శ్రమిస్తున్న యోధులలో మన పోలీసులు ముందున్నారని చెప్పాలి.పోలీసు శాఖ కరోనా వైరస్‌ సోకకుండా ప్రజలను కాపాడటంలో తమ వంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది కొవిడ్‌ ప్రభావ సమయంలో ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని చెప్పడానికి సినీ ఇండస్ట్రీ సపోర్ట్‌ తీసుకున్నారు.మన టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున,సూపర్ స్టార్ మహేశ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ... ఇలా హీరోలందరూ ప్రజలను జాగ్రత్తలు పాటించమని చెబుతూ వీడియోలు రిలీజ్‌ చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువైంది.గత ఏడాది కంటే ఈ సారి ప్రభావం ఎక్కువ కావడంతో.. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్స్‌ వాడాలని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఈ సమాచారం ప్రజలకు మరింత ప్రభావవంతంగా చేరడానికి తెలంగాణ పోలీస్‌ శాఖ మరో అడుగు ముందుకేసింది.



టాలీవుడ్ అగ్ర హీరో సూపర్‌స్టార్‌ మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ లోని ఒక డైలాగ్ తో ఓ వీడియో డైలాగ్ వీడియో చేయించి విడుదల చేసింది. "జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్‌ జోన్‌లో పడేశాడు. బీ అలర్ట్‌, ప్రొటెక్టర్‌ యువర్‌ సెల్ఫ్‌... వేర్‌ మాస్క్‌" అనే డైలాగ్స్‌ మహేశ్‌ నోట పలికించారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలనేది ఈ వీడియో సందేశం.అది కూడా మహేశ్‌ నోట రావడం మంచిదే. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది. అందులోను సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్ కావడంతో అటు అభిమానులతో పాటు నెటిజన్స్ ఈ వీడియోని తమ వాట్సాప్ స్టేటస్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. మరి వైరల్ అవుతున్న ఈ వీడియో పై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: