టాలీవుడ్ సీనియర్
హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎంతో కష్టపడి ఒక్కడే ఎన్నో ఆటు పొట్లు ఎదుర్కొని
ఇండియా లోనే పెద్ద
మెగాస్టార్ అయ్యాడు. కొన్ని కోట్లాది అభిమానులని ఆయన సొంతం చేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.తన అభిమానులు ఆపదలో ఉంటే ఎక్కడైనా సరే ఆయన ఆదుకుంటారు. సాయం చెయ్యడంలో ఎప్పుడూ ముందుంటారు.‘‘దైవం మానుష రూపేణా అన్నారు పెద్దలు. అంటే.. మనుషుల్లోనే దేవుడున్నాడని అర్థం. ఆ విషయాన్ని పదేపదే తన పెద్ద మనస్సుతో నిరూపిస్తున్నారు మన మెగాస్టార్ శ్రీ చిరంజీవి. అప్పుడు లాక్ డౌన్ టైం లో గుంటూరు
జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ’ అధ్యక్షురాలు కుమారి
రాజనాల వెంకట నాగలక్ష్మి
గుండె జబ్బుతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న
చిరంజీవి గారు మెడికల్ రిపోర్ట్స్ తెప్పించుకుని హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ చైర్మన్, ఎండీ, ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్
గోపీచంద్ గారి ద్వారా జబ్బు తీవ్రతను గమనించారు.
వెంటనే హుటాహుటిగా ఆమెను హైదరాబాద్‌కి రప్పించే ఏర్పాట్లు చేసి, ఆపరేషన్‌కి సంబంధించి అన్ని సదుపాయాలు దగ్గరుండి చూసుకున్నారు.మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన సేవాగుణం మరో మారు వెలుగులోకి వచ్చింది.తాజాగా తూర్పు
గోదావరి జిల్లా అంబాజీ
పేట మండలంకి చెందినటువంటి చిరు వ్యవస్థాప అధ్యక్షుడు నాగబాబు
కరోనా వైరస్ సోకి
కాకినాడ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.
నాగ బాబు పరిస్థితి తెలుసుకున్న
చిరంజీవి ఆ
కాకినాడ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు.ఆ తరువాత
నాగ బాబుకి డైరెక్ట్ గా ఒక మెసేజ్ కూడా పంపించారు.నీకేమి కాదు డాక్టర్లతో మాట్లాడాను ధైర్యంగా వుండు అని
చిరంజీవి ఫోన్ చేసి మరి ఆ అభిమానితో మాట్లాడారట.
చిరంజీవి ఫోన్ చెయ్యడంతో అభిమాని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.ఇక మెగా ఫ్యాన్స్ చిరంజవి సేవా గుణాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.