చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో చిరంజీవితో కలిసి అదిరిపోయే యాక్షన్ సీన్ లలో నటిస్తారని.. ఆ సన్నివేశాలన్నీ కూడా మెగా అభిమానులను బాగా అలరిస్తాయని తెలుస్తోంది. ఆచార్య సినిమా మే 14వ తేదీన విడుదల కావలసి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆచార్య సినిమా ఏ తేదీన విడుదల అవుతుందనే విషయం పై ఇంకా క్లారిటి రాలేదు. 



ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ నుంచి సామాజిక సంస్కర్త గా మారిన ఒక వ్యక్తిగా కనిపించనున్నారట. సాధారణంగా దర్శకుడు కొరటాల శివ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటారు. ఆచార్య సినిమా తో కూడా ఆయన ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ఇస్తారని తెలుస్తోంది. అయితే చిరంజీవి ఆఖరిసారిగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా కి.. ఆయన అప్ కమింగ్ ఆచార్య మూవీ కి మధ్య ఒక లింకు ఉందని సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి సైరా ఒక పిరియాడికల్ డ్రామా.. ఆచార్య ఒక సోషల్ ఫిలిం. మరి ఈ రెండింటి మధ్య ఉన్న లింకేంటి? అనే సందేహం మీలో వ్యక్తం కావచ్చు. కానీ ఈ రెండు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది.



అదేంటంటే సైరా నరసింహారెడ్డి సినిమా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఆచార్య సినిమా కూడా ఒక వ్యక్తి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. విశాఖపట్నం సాయుధ పోరాటం లో పాల్గొన్న ఒక తిరుగుబాటు దారుడు జీవిత చరిత్ర నుంచి చిరంజీవి క్యారెక్టర్ ని కొరటాల శివ రూపొందించారట. దీన్నిబట్టి ఈ రెండు సినిమాలు కూడా నిజజీవిత క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాని నిర్మాత నిరంజన్ రెడ్డి 140 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: