ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చలు బాగా జరుగుతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఆయన నుండి ఎంతో నాసిరకమైన సినిమాలు వచ్చాయి. ఇంతకుముందు వివాదాస్పదమైన కామెంట్లు పెంచుకొని, తనదైన శైలిలో పబ్లిసిటీతో సినిమాలను అమ్ముకునేవాడు రాంగోపాల్ వర్మ. కానీ ఈ మధ్య అది కూడా వర్కౌట్ అవకపోవడం తో ఆయన సినిమాలను అందరూ లైట్ గా తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తే మెయింటైన్ ఖర్చులు కూడా రావడం లేదని బయ్యర్లు ఆయన సినిమాలను కొనడం మానేశారు.


దీంతో ఓటీటీ లో  తన సినిమాలను రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు వర్మ. గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలోనే కొన్ని సినిమాలను రిలీజ్ చేశాడు. ఆ సినిమాలతో డబ్బు బాగా సంపాదించాడు. ఇప్పుడు తానే సొంతంగా ఓటీటీ మొదలు పెట్టేసాడు. ఇకపై తను డైరెక్ట్ చేసిన సినిమాలను స్పార్క్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాడని సమాచారం.

అయితే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సినిమా "డేంజరస్". ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇద్దరు లెస్బియన్ల మధ్య నడిచే కథ ఇది. ఇందులో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా లాంచ్ చేశాడు వర్మ. చూసినవారంతా వర్మ పై మరిన్ని విమర్శలు చేస్తున్నారు. బీ గ్రేడ్ సినిమాలకు మించి ఈ సినిమా ట్రైలర్ ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. తను తీసే సినిమాలలో హీరోయిన్లను ఎంతో స్పెషల్ గా చూపించే వర్మ. ఈ మధ్యకాలంలో కేవలం వారి అందాల పైన దృష్టి పెట్టబోతున్నాడని ఇవన్నీ చాలా చీప్ గా ఉన్నాయి అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ట్రైలర్ చూసిన వారంతా ఇంటిమెట్  గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఇంతకుమించి వర్మవరెస్ట్ గా తీయలేరు అనుకున్న ప్రతిసారి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తూ మరింత షాకిస్తున్నాడు. ఏది ఏమైనా ఇలాంటి ట్రైలర్లు చూస్తూ, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: