హీరోయిన్ రంభ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈమె ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి బాక్సాఫీస్ ను షేక్ చేసిన హీరోయిన్. ఈమె అసలు పేరు విజయలక్ష్మి ఊరు విజయవాడ. ఆమె చదువుకుంటున్న రోజుల్లో స్కూల్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా అక్కడికి వచ్చిన డైరెక్టర్ హరిహరన్ 1992 వ సంవత్సరంలో విజయలక్ష్మికి పదిహేనేళ్ళ వయసు ఉండగా మలయాళంలో "సర్గం" అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో "ఆ ఒక్కటీ అడక్కు" అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం . ఇందులో విజయలక్ష్మి క్యారెక్టర్ పేరు రంభ.

ఇక నాటి నుండి తన పేరును రంభగా మార్చుకొని టాలీవుడ్ స్వర్గసీమకు భువిలో వెలసిన రంభగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసింది లేదు. దాదాపు అందరి అగ్ర హీరోల సరసన జత కట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్  క్రియేట్ చేసుకుంది. 1992 నుండి 2010 వరకు సక్సెస్ ఫుల్ గా తన సినీ జీవితాన్ని కొనసాగించిన రంభ 2010లో కెనడా బిజినెస్ మాన్ ఇంద్ర కుమార్  ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ళు హాయిగా గడిచిన వీరి వివాహ జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు కావాలంటూ చెన్నై కోర్టును ఆశ్రయించింది రంభ. అప్పట్లో ఈ విషయంపై పెద్ద చర్చలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వలన విడాకులు మంజూరు కాలేదు.

అది అలా గడుస్తుండగా మళ్ళీ కొన్ని షోల కోసం తిరిగి మేకప్ వేసుకున్నారు రంభ. మళ్లీ భర్తకు దగ్గరవడంతో యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసి తిరిగి తన కుటుంబంతో బిజీ అయిపోయింది. ఈ మధ్య ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి కానీ అలా ఏమీ జరగలేదు. ప్రస్తుతం ఆమె గృహిణిగా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: