టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మరోసారి మీడియాపై సీరియస్ అయ్యింది.ఓ ఆంగ్ల పత్రికలో తన గురించి రాసిన కథనంపై ఫైర్ అవుతూ.. వారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రకుల్ స్పందిస్తూ.."మీడియా వాళ్ళకి హీరోయిన్స్ అంటే చులకన భావం అనేది ఎప్పుడు పోతుందో..నాకు ఎన్నటికీ అర్థం కాని విషయం ఏంటంటే..తెలుగులో నాకు అవకాశాలు రావడం లేదని నేనెప్పుడు చెప్పాను?నిజం తెలుసుకోకుండా నాకుతెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదని వీళ్ళు హెడ్డింగ్స్ ఎలా పెడతారు?ఒక సంవత్సరానికి 365 రోజులే ఉంటాయి.

ప్రస్తుతం నేను ఆరు సినిమాల్లో నటిస్తున్నాను.కొత్త ఆఫర్స్ వచ్చినా.. నా డేట్స్ అడ్జెస్ట్ కానీ పరిస్థితి నాది.ఒకవేళ కనుక మీరు నా డేట్స్ పెంచగలిగితే మా టీమ్ వాళ్ళకి సహాయం చేయండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే సహించేది లేదని" ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చింది రకుల్.. ఇదిలా ఉంటె తాజాగా రకుల్ ట్వీట్స్ పై అగ్ర దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు.ఇండ్రస్టీ కి సంబంధించి ఎలాంటి అంశంపై అయినా స్పందిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు.ఇందులో భాగంగానే రకుల్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.."నాకు తెలుసు రకుల్‌.. షూటింగ్స్‌ తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో. నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్‌ నీకు నచ్చినా.. నీ డేట్స్‌ లేక ఆ సినిమా పోస్ట్ ఫోన్ అయింది.

నువ్వు ఇలాగే నీ సినిమాలతో అందరికీ సమాధానం చెప్పు రకుల్' అంటూ ట్వీట్ చేసాడు హరీశ్ శంకర్.ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక రకుల్ విషయానికొస్తే.. పేరుకి ఆరు సినిమాలు చేస్తున్నా.. ఈ హీరోయిన్ కి రెమ్యూనరేషన్ తగ్గించేసారట నిర్మాతలు. ఇక రకుల్ కూడా కొంత రెమ్యూనరేషన్ ని తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు మరి కొందరు నిర్మాతలు ఈమె తగ్గించుకున్న రెమ్యూనరేషన్ కి ఇంకా తక్కువ ఇస్తామని కోరగా.. ఆ సినిమాలను తప్పుకున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో తనకు కథతో పాటు రెమ్యూనరేషన్ కూడా ఒకే అయితేనే ఆ ప్రాజెక్ట్ లను ఒప్పుకుంటోందట ఈ హీరోయిన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: