టాలీవుడ్ సినీ ప్రేక్షకులు సంగీతానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సినిమాలో పాటలు బాగుంటేనే సినిమాకి వెళ్లే మన ప్రేక్షకులు పాటలు బాగోలేకపోతే సినిమా థియేటర్ వైపు కూడా కన్నెత్తి చూడరు. అందుకే వారి అభిరుచికి తగ్గట్లుగా మన దర్శకనిర్మాతలు సూపర్ హిట్ పాటలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. అంతెందుకు సినిమా మెయిన్ ప్రమోషన్ ఎక్కువగా సినిమా పాటల నుండే వస్తుందని అందరికి తెలిసిందే. అందుకే ఆడియో ఫంక్షన్ వంటివి నిర్వహిస్తూ పాటలను ప్రమోట్ చేస్తూ తమ సినిమాను పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు.

ఇక తెలుగు సినిమాలకు సంగీత దర్శకుల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుల కొరత ఉందని స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాకు ఆ స్థాయి సంగీతం ఇవ్వడానికి సరైన వాళ్ళు లేరనే చెప్పాలి. ఒకరిద్దరు ఉన్న ప్రతిసారి వారి సంగీతమే థియేటర్లో వినిపిస్తుండటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. కీరవాణి రాజమౌళి సినిమాలు తప్ప మరే సినిమాలు చేయడం లేదు. దేవి శ్రీ ప్రసాద్ ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. తమన్ మాత్రమే అందరికీ సమాధానంగా నిలుస్తున్నాడు. అయితే ఆయన మాత్రం ఎన్ని సినిమాలని చేయగలడు చెప్పండి .

ప్రస్తుతం మన మన టాలీవుడ్ లో 15 మందికి పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో లో పది మంది తమన్తో ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ డల్ గా కనబడటంతో తమన్ హవా నడుస్తుంది. తమన్ ఇన్నేసి సినిమాలు చేసే క్రమంలో ఒక సినిమాకు పాటలు సరిగా ఇవ్వలేక పోయినా ఆయన క్రేజ్ కూడా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ కి ఒక సంగీత దర్శకుడు కోసం అయితే ఎదురుచూస్తుంది. అలా కోలీవుడ్లో సత్తా చాటుతున్న అనిరుద్ పేరు పెద్ద హీరోల సినిమా కోసం వినిపిస్తుంది. ఒకప్పుడు సౌత్ సినిమాకే సంగీత పరంగా తెలుగు సినిమా కేరాఫ్ అడ్రస్ గా ఉండేది .ఇప్పుడు అలాంటి నాణ్యమైన సంగీతదర్శకులు లేకుండాపోయారు తెలుగులో.  అయితే  అనిరుధ్ కూడా ఫ్లాప్ సినిమాలు తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు . దాంతో ఆయన కూడా వెనుకబడి పోయారు. మణిశర్మ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నడు. మరి భవిష్యత్తులో టాలీవుడ్ కి తమన్ కాకుండా మరొక సంగీత దర్శకుడి ఆప్షన్ ఎవరు అవుతారో చూడాలి వస్తారో చూడాలి ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: