సినిమా ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడూ తిరుగుతుందో ఎవరు చెప్పలేం. ఇవాళ చేతిలో ఒక్క అవకాశం లేకపోయినా రేపు డజన్లకొద్దీ సినిమా అవకాశాలు వచ్చి పడుతుంటాయి సదరు వ్యక్తులకు. అలాగే దురదృష్టం కూడా అలానే వెంటాడుతుంది. ఈరోజు ఫుల్ ఫామ్ లో ఉన్నారు అనుకున్న ఆర్టిస్టు రేపు ఎలాంటి స్థితిలో ఉంటారో తెలియదు. చేతిలో సినిమాలు లేక ఇలా ఎంతో మంది ఫేడ్ అవుట్ అయిపోయి చిన్న జీవితాన్ని గడుపుతూ ఉంటారు.  సగం సగం ఫేమ్ తో ప్రజల్లోకి వెళ్ళలేక ఇంట్లో కూర్చోలేక వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు .

అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1999 లో ఉపేంద్ర నటించిన ఉపేంద్ర సినిమా తో సినిమాల్లోకి అడుగు పెట్టింది హీరోయిన్ దామిని. తెలుగులో కూడా ఓ సినిమా నటించిన ఈమె కు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు అందుకోలేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయింది. కథల ఎంపిక, పాత్రల విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించక పోవడం వల్లే ఇలా అయిందని అంటున్నారు. ఆమె చేసిన ఫ్లాప్ సినిమాల వల్లే ఆమె సినీ భవిష్యత్తు నాశనం అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

దామిని డైట్ కంట్రోల్ లేకపోవడం వల్ల బరువు కూడా పెరిగింది.  ఆమె సినిమా అవకాశాలు  తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతున్నారు.  దామిని తెలుగు తమిళ మలయాళ భాషల్లో దాదాపు 15 సినిమాల్లో నటించారు. ఆమె చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 2016లో స్వతంత్ర పాల్య మూవీ లో నటించిన ఆమె ఆ తర్వాత ఇండస్ట్రీలో కనిపించలేదు. అలాగే తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అందగాడు మూవీలో నటించడం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది కానీ ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు. మరి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది ఆమె నోరు విప్పితే గానీ తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: