
సినీ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా నట వారసులు రాణించడం చేస్తున్నారు. ఓ నాలుగు కుటుంబాలు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నాయి. వాళ్లలోనే కొత్త హీరోలు వస్తూ సినిమాలు చేస్తున్నారు. బయటివారు కూడా వస్తున్నారు. అయితే ఎవరి టాలెంట్ వారిదే. తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించి ఆ తరువాత ఎలా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవగలిగారు అనేదే ఇక్కడ అసలు పాయింట్. తాజాగా సూపర్ స్టార్ మేనల్లుడు అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అలా చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అలా వెండితెరపై వెలిగిపోతున్న టాలీవుడ్ హీరోల మెనల్లుళ్ల ఎవరెవరున్నారో ఒకసారి చూద్దాం.
వెంకటేష్ మేనల్లుడు అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నారు. వెంకటేష్ చెల్లెలు నాగార్జున ను వివాహం చేసుకోగా వారికి నాగచైతన్య పుట్టాడు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా నాగార్జున ఆమెతో విడిపోయి అమలను పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ లో క్రేజీ మామ అల్లుళ్ళు గా చిరంజీవి సాయి ధరంతేజ్ లు ఉంటారని చెప్పవచ్చు. మెగా మేనల్లుడు గా టాలీవుడ్ కి రేయ్ సినిమాతో పరిచయమై ఇప్పుడు మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయిధరమ్.
ఇటీవలే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో వైష్ణవ్ తేజ్ కూడా చిరంజీవి మేనల్లుడు కావడం విశేషం. సాయి ధరంతేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అలాగే చిరంజీవి తమ్ముళ్లు అయినా పవన్ కళ్యాణ్ నాగబాబులకు ఇద్దరు హీరోలు మేనల్లుళ్ళు అవుతారు. నాగార్జున మేనల్లుడు టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్. చి ల సౌ తో మంచి హిట్ సంపాదించుకుని ఇప్పుడు మరో వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుమంత్ కూడా నాగార్జున మేనల్లుడే. అల్లు అరవింద్ మేనల్లుడు రామ్ చరణ్. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ. వీరు కూడా సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు