
టాలీవుడ్ లో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేస్తే ఆ హీరో హీరోయిన్ లకు ఎఫైర్ లు అంటగట్టేస్తూ ఉంటారు. వారిద్దరి మధ్య ఏదో ఉందని అందుకే ఆ హీరోయిన్ కి హీరో మళ్లీ ఇంకో సినిమా ఛాన్స్ ఇచ్చారని, ఆ కారణంగా వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని సృష్టిస్తుంటారు. ఎప్పటినుంచో ఈ రకమైన గాసిప్స్ సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొంతమంది. అయితే ఇది నిజం కాదని తెలిసినా కూడా వారి జీవితాంతం ఈ గాసిప్ వెంటాడుతూనే ఉంటుంది.
బయట కలిసిన, సరదాగా మాట్లాడుకున్నా వారిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని చాలా రకాల పుకార్లు తయారు చేసి వీక్షకులకు ఆనందాన్ని తెచ్చినా సదరు హీరో హీరోయిన్ లకు ఇది భవిష్యత్తులో ఎంతో సమస్యకు దారి తీస్తుంది. అలా తొలి సినిమా చేశాక రెండవ సినిమా కలిసి చేయడం వల్ల ఈ రకమైన పుకార్లకు బలి అయ్యారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత గీత గోవిందం సినిమా తో సూపర్ హిట్ అందుకుని హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అనే మరొక సినిమా కూడా చేయవలసి వచ్చింది.
ఆ సినిమాలో టీజర్ వచ్చిన కొత్త లో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని అందుకే మరోసారి కలిసి నటిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. అంతే కాదు ఆ సమయంలోనే రష్మిక తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ తో విడిపోవడంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉన్న కారణంగానే ఆమె రక్షిత్ తో విడిపోయారని కూడా చాలామంది కామెంట్లు చేశారు. అయితే ఆ తర్వాత చాలా సందర్భాల్లో వీరిద్దరూ తమ మధ్య ఏమీ లేదని బహిరంగంగా చెప్పారు. అయినా కూడా ఇప్పటికీ ఆ పుకారు అనేది పలువురి నోళ్లలో నానుతూనే ఉంది. వీరు లాగానే చాలామంది యంగ్ హీరో హీరోయిన్ లు అందరూ ఇలాంటి సమస్యతో ఎంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా ఆలోచిస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు.