కన్నడ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నటించి కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అలనాటి
హీరోయిన్ కృష్ణకుమారి.
ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి అగ్ర నటులతో నటించి ఆమె తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అంతటి ప్రతిభావంతురాలైన కృష్ణకుమారి నవ్వితే నవరత్నాలు అనే చిత్రంతో చిత్రసీమలో ప్రవేశించి ఆ తరువాత ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలలో నటించారు. అప్పటి నుంచి తనకు ప్రతి
సినిమా అద్భుతమైన
సినిమా అని ఆమె వెల్లడించారు.
తొలుత సాంఘిక చిత్రాలతో ప్రారంభించి ఆ తర్వాత పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలో ఆమె కనబరిచిన అందానికి అభినయాని కి ఆమెకు మరిన్ని అవకాశా లు లభించాయి. యాక్టింగ్ లో ఎలాంటి శిక్షణ తీసుకొ ని ఆమె అంత బాగా నటించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగులో తనకు అభిమాన నటులు అంటే
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు అని, సెట్లో చాలా సరదాగా ఉంటారు అని వారితో ఆమెకి ఉన్న స్నేహబంధాన్ని చాలాసార్లు చెప్పారు. వారి కంటే సీనియారిటీలో తక్కువ అనుభవం ఉన్న నటి కావడంతో వారి సలహాలు సూచనలు ఎంతో ఉపయోగ పడ్డాయి అని కూడా తెలిపారు.
ఇక తెలుగు అగ్రహీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె ఎక్కువగా
ఎన్టీఆర్ తో ఏకంగా 25 చిత్రాలు చేశారు. అవన్నీ హిట్ చిత్రాలే కావడం విశేషం. అయితే ఈ సినిమాలు చేస్తున్న సందర్భంలో ఈ ఇద్దరికీ ఎఫైర్ ఉందని అప్పట్లో చాలా వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇవేవీ నిజం కావని బహిరంగంగానే ప్రేక్షకులకు వెల్లడించారు ఈ ఇద్దరు నటులు. నటులుగా సినీ వినీలాకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా వీరిద్దరూ మంచి స్నేహితులుగా కడదాక
ఉన్నారు. అంతే కానీ ఇలాంటి ఎన్ని పుకార్లు వచ్చినా తమ స్నేహబంధం ని విడదీయలేని వారు తెలిపారు.