
సాధారణంగా కొంచెం పాపులారిటీ వచ్చినా ఆ పాపులారిటీని బాగా సద్వినియోగం చేసుకొని రెండు చేతులా డబ్బులు సంపాదించాలని నటీనటులు కుతూహలపడుతుంటారు. స్టార్ సెలబ్రిటీలకు సినిమాల నుంచి పారితోషికం లక్షల కోట్ల రూపాయలు అందుతుంది కానీ బ్రాండ్స్, వాణిజ్య ప్రకటనల నుంచి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. అయితే ప్రతి స్టార్ డబ్బులు సంపాదించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తారు కానీ కొందరు మాత్రం ఒక్క యాడ్ కి కోట్ల రూపాయలు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినా అవి చేసేందుకు అంగీకరించరు. అలాంటి మనస్తత్వం గల నటీనటులు టాలీవుడ్ లో కూడా ఉన్నారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులందరినీ ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి సినిమాల్లో తప్ప మరేతర యాడ్స్ గాని ప్రమోషన్స్ గానీ అస్సలు చేయరు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి కూడా ఆమె వెళ్లడానికి ఇష్టపడరు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కూడా యాడ్స్ లో నటించడానికి అస్సలు ఇష్టపడరు. అయితే సమాజానికి ఉపయోగపడే వీడియోస్ కోసం ఆయన నటించడానికి ముందుకు వస్తారు. మంచి చేసే ఉద్దేశంతో ఆయన ప్రచారం చేయడానికి కూడా సై అంటారు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నందమూరి బాలకృష్ణ కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు అసలు ముందుకు రారు.
సీనియర్ నటీమణి గౌతమి కూడా అడ్వర్టైజ్మెంట్స్ లో ఇప్పటివరకూ కనిపించలేదు. గౌతమి 1990 కాలంలో తెలుగు పరిశ్రమలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత తమిళ పరిశ్రమలో కొనసాగారు. అయితే ఆమెకు చాలా క్రేజ్ ఉన్నప్పటికీ తాను మాత్రం సినిమాల్లో తప్ప మరెక్కడా నటించలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా యాడ్స్ లో నటించేందుకు విముఖత చూపుతారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మోహన్ బాబు తనయుడు విష్ణు కూడా వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటారు.