తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పరభాషా నటీమణుల ప్రభావం భారీగా పెరిగింది. తెలుగు
సినిమా దర్శకులు
ముంబై భామల మోజులో పడి పోయారు.
టాలీవుడ్ సినిమాలో వీరికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడంతో, అందాలు చూపించడంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడంతో, ప్రేక్షకులు ఆలోచించే విధంగా గ్లామర్ షో చేస్తూ ఉండడంతో వీరిని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు.
సినిమా ఎలాంటిదైనా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తెలుగు తెరపై ఆ విధంగా ఎంతో మంది హీరోయిన్లు వచ్చి తమ ప్రతిభను చాటుకున్నారు.
అయితే గతంలో తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి కనిపించేది కాదు. ఇండస్ట్రీలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకుల మనసు దోచుకున్న తెలుగు నటీమణులు ఉండేవారు. వారి నటనకు జనాలు కూడా బ్రహ్మరథం పట్టేవారు. అలాంటి అద్భుతమైన నటీమణులు కన్నాంబ, కాంచనమాల. తెలుగు లో పుట్టిన
తమిళ సినిమా ఇండస్ట్రీలో సైతం అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు వీరు. తమ నటనకు ఎంతోమంది ఆకర్షితులయ్యేవారు. కాంచనమాల తో పోలిస్తే కన్నాంబ రేంజ్ మరో రేంజ్ లో ఉండేది.
తమిళ కావ్యం ఆధారంగా తీసిన కన్నగి సినిమాలో ఆమె చెప్పిన డైలాగులకు థియేటర్లలో జనాలు లేచి నిలబడి చప్పట్లు గౌరవించేవారు.
ఇది చాలు ఆమె గొప్పతనం ఏంటో చెప్పుకోవడానికి. గృహలక్ష్మి సినిమాలో ఒక సీన్ ఉంటుంది. రోడ్డుమీద పరిగెడుతూ దేవుడు లేడు న్యాయం అంటూ పరిగెత్తాలి. కెమెరా ఎక్కడో పెడతారు. రోడ్డుపై పరుగెడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు వాహనాల మధ్య నుంచి వస్తున్న ఆమెను చూస్తారు. ఎవరో పిచ్చిది ఆక్సిడెంట్ అవుతుందో అని పట్టుకుని జీప్ ఎక్కిస్తారు. నేను
సినిమా నటి నేను ఎంత చెప్పినా వినిపించుకోరు. పిచ్చిలో ఏదో మాట్లాడుతుంది అని స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడికి
సినిమా యూనిట్ సభ్యులు వెళ్లి విషయం చెప్పి ఆమెను తీసుకొస్తారు. ఇది ఆమె నటన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి నిదర్శనం.