టాలీవుడ్ లో అందం, అభినయం కాకుండా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్ లకు ఈ రకమైన ఫార్ములా ఉంటే వారు స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు. కానీ చాలా మంది కి టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోవడంతో అవకాశాలు లేక కనుమరుగైపోయారు. అయితే కొంత మంది హీరోయిన్ లకు టాలెంట్ కొంత మాత్రమే ఉన్నా వారికి అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా టాలీవుడ్ లో అదృష్టం లేని ముద్దుగుమ్మలు రెజినా, నివేతా థామస్ లు అని చెప్పుకోవచ్చు.

అందం, అభినయం, గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనక్కి రాని ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు చేసిన తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి దర్శకనిర్మాతల కళ్ళల్లో పడ్డారు వీరిద్దరు. అయితే వీరు చేసిన సినిమాలు ప్లాపులు కావడంతో వీరికి క్రేజ్ తగ్గిపోయింది. సోషల్ మీడియాలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నా కూడా వెండితెరపై వారిని మైమరపించడం లో కొంత విఫలమయ్యారు. తద్వారా అవకాశాలు తగ్గిపోవడంతో వీరికి ఇప్పుడు క్రేజ్ కూడా తగ్గిపోయింది. 

దాంతో ఇప్పుడు వీరిద్దరూ కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అదే శాకిని.. డాకిని..  ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తుంది. ఈ ఏడాది దసరా కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట. రణరంగం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి ఒక సాంగ్ తో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మరి డైరెక్టర్ తో సహా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమా అదృష్టం తేస్తుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: