టాలీవుడ్ లో అన్నదమ్ములు అంటే ఇలానే ఉండాలి అని నిరూపిస్తున్నారు హీరోలు నందమూరి కళ్యాణ్ రామ్ అండ్ తారక్.  వీరు హీరోలుగా నటించినప్రతి సినిమా ఫంక్షన్లలోనూ ఇద్దరూ కనిపిస్తూ తమ మధ్య ఉన్న బంధాన్ని అనుబంధాన్ని వెల్లడిస్తూ ఉంటారు ప్రేక్షకులకి. తమ్ముడు పై అన్న ఎంతో ప్రేమను చూపిస్తాడు. తమ్ముడు కూడా అదే గౌరవ మర్యాదలను అన్న పై చూపిస్తూ ఇప్పటివరకు ఒకరు సినిమాలకు ఒకరు హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ ను సెట్ చేసే పనిలో ఎన్టీఆర్ ఉన్నాడు.

మొదటి నుంచి సరైన కథలు ఎంపిక చేసుకోక కళ్యాణ్ రామ్ భారీ ఫ్లాపులు నమోదు చేసుకున్నాడు. దాంతో ఆయన మినిమమ్ హీరోగా కూడా నిలబడ లేక పోయాడు. ఇటీవలే ఎన్టీఆర్ కలగజేసుకుని అన్నతో మంచి సినిమా లు చేయిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న బింబీ సారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎన్టీఆర్ కూడా ఓ చేయి వేస్తున్నాడట. ఇకపోతే ఆయన పుట్టిన రోజు సందర్భంగా 1940 వ సంవత్సరం లో సాగే ఓ పీరియాడికల్ సినిమాని కూడా అనౌన్స్ చేశాడు కళ్యాణ్. ఈ వెరైటీ సినిమాల ఎంపికలో చూస్తుంటే వీటిలో తమ్ముడి పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే తమ్ముడుని ఎంతో అపురూపంగా చూసుకునే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ నీ నాన్న అని పిలుస్తారట. అందుకు కారణం వారి నాన్న ఇటీవలే చనిపోవడం. హరికృష్ణ  వీరిద్దరికీ కొడుకులు కాగా తల్లులు మాత్రం వేరు వేరు. ఇకపోతే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. మొదట్లో తనకు ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్టు లేకపోయినా కూడా ఒక్కడే అంచెలంచెలుగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చి తాతకు తగ్గ మనవడిగా ఇప్పుడు టాప్ హీరో లనే మొదటి స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: