మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ అయిన ఆమె అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె "బీ-పాజిటివ్" అనే ఒక హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్ మేగజైన్ సొంతంగా ప్రారంభించి చీఫ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె పలు రంగాల్లో రాణిస్తూ ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా గెలుచుకున్నారు. స్ట్రాంగ్ ఉమెన్‌గా సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన తన కుటుంబ సభ్యుల కోసం ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తుంటారు. ముఖ్యంగా తన ముద్దుల భర్త రామ్ చరణ్ తో సరదాగా సమయం గడపడానికి ఆమె తన పనులన్నీ పక్కన పెడుతుంటారు.

అయితే తాజాగా ఉపాసన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రియమైన భర్త గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రశాంతంగా సమయం గడపడానికి తాము రెగ్యులర్ గా హాలిడేస్ కి వెళ్తామని ఆమె వెల్లడించారు. అలాగే తన భర్తను ముద్దుగా "మిస్టర్ సి" అని పిలుస్తాను అని ఆమె చెప్పారు. తనకు ఇష్టమైన వారిని ఎప్పుడూ తాను నిక్ నేమ్స్ తోనే పిలుస్తానని ఆమె వెల్లడించారు. అలాగే ఆమె తన పిల్లల ప్లానింగ్ విషయంపై కూడా స్పందించారు. సరైన సమయం వచ్చినప్పుడు పిల్లలు కంటాము అని ఆమె వెల్లడించారు. రామ్ చరణ్ ని తండ్రిగా చూడాలనుకునే ఫ్యాన్స్ ఇంకొంత సమయం వెయిట్ చేయాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు.

ఇకపోతే తాజాగా ఆమె తన భర్త రామ్ చరణ్ తో కలిసి హైదరాబాద్ లోని ఒక రెస్టారెంట్ లో లంచ్ చేశారు. లంచ్ డేట్ అంటూ ఆమె తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఒక పోస్ట్ ఫొటో చేశారు. ఈ ఫొటోలో చెర్రీ, ఉపాసన నవ్వుతూ కనిపించారు. అయితే చాలా ముచ్చటగా కనిపిస్తున్న ఈ క్యూట్ ఫొటో పై అభిమానులు స్వీట్ కామెంట్స్ పెడుతున్నారు. సో క్యూట్, లవ్లీ, బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: