
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. ఈ మేరకు అమెజాన్ సంస్థ అధికారికంగా దీనిని ప్రకటించింది. ఈనెల 20న ఈ సినిమా విడుదల కాబోతున్న ట్లు తన ట్విట్టర్ లో పేర్కొంది అమెజాన్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అన్న ప్రచారానికి తెరలేపుతు ఈ అనౌన్స్మెంట్ రాగా ప్రతి ఒక్కరు ఈ అధికారిక ప్రకటనతో ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. మొన్నటి దాకా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందని గొప్పలు పలికి ఇప్పుడు ఓ టీ టీ లో విడుదల చేయడం అభిమానులను నిరాశ పరిచింది.

దీనికితోడు నిర్మాతల మండలి అక్టోబర్ వరకు ఏ సినిమాను డిజిటల్ రిలీజ్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చినా కూడా నిర్మాతలు ఈ సినిమాని డిజిటల్ రిలీజ్ చేయడం దేనికి దారి తీస్తుందో అని సినీ పెద్దలు అంటున్నారు. ఇకపోతే ఓటీటీ ప్రేమికులు ఈ సినిమా ఓ టీ టీ లో రిలీజ్ అవడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అమెజాన్ సంస్థ భారీ రేటు తో ఈ సినిమాను కొనుగోలు చేస్తుందని తెలుస్తుండగా ఇంత త్వరగా ఈ సినిమాని వారు రిలీజ్ చేస్తారని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించగా, కంచరపాలెం ప్రేమ్ కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకి ఈ సినిమా రీమేక్ గా కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే అణగారిన కులాలకు చెందిన ఒక కుటుంబం అగ్ర కులంలోని వారి వల్ల కలిగే సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది. రీమేక్ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ అయినా వెంకటేష్ ఈ సినిమాతో ఈ విధమైన హిట్ అందుకుంటాడో చూడాలి.