
అలనాటి హీరోయిన్లలో కథానాయిక రాధ కు మంచి పేరు ఉంది. సినిమాల్లోకి వచ్చాక రాధ గా తన పేరు మార్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ హీరోయిన్ పేరు ఉదయ చంద్రిక. మలయాళం లో పుట్టి పెరిగిన ఈమె తెలుగు తమిళ చిత్రాలతో ఎనభైయవ దశాబ్దంలో ఎంతో పేరుగాంచిన హీరోయిన్. దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించిన రాధిక తెలుగు లోనీ స్టార్ హీరోలందరితో నటించి అందరి హీరోల అభిమానుల ఆదరణను దక్కించుకుంది. అప్పట్లో టాప్ హీరోయిన్ లకు ఎంతో పోటీ ఇచ్చి నెంబర్ వన్ స్థాయి హీరోయిన్ అయింది.

రజనీకాంత్, కమలహాసన్, శివాజీ గణేషన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈమె భారతీరాజా దర్శకత్వంలోని అలైగల్ ఓయివత్తి లై తో చిత్ర రంగ ప్రవేశం చేశారు. తన నటన జీవితం తారాస్థాయిలో కి చేరుకోగానే తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి స్థిరపడిపోయింది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమారుడు కాగా వారి లో కార్తిక ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది. చిన్నమ్మాయి తులసి కూడా కథానాయికగా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది.
ఈమె కాకుండా రాధ అక్క అంబిక కూడా సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నటించింది. కొన్ని సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె చెల్లి కంటే ఎక్కువ ఫేమ్ ను తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం అలనాటి తారామణులు రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో రాధ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన రాధ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోగా వారి కోరిక మేరకు ఆమె రీ ఎంట్రీ ఇస్తారో అనేది చూడాలి. తెలుగులో ఆమె ఆఖరిగా పందిరిమంచం అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.