ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు అందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడంతో వీరిని చూసి మరికొంత మంది హీరోలు కూడా ఈ తరహా లో సినిమాలు చేసి దేశవ్యాప్తంగా మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమా అంటే మామూలు విషయం కాదు. అంతా కాన్వాస్ ఉన్న కథ దొరకాలి. వందల కోట్లు కుమ్మరించే నిర్మాత ఉండాలి. ఇవన్నీ దొరికినా కూడా ఆ హీరో కు ఎంతో కొంత వేరే భాషలో ఇమేజ్ వుండాలి.

లేదంటే వారు చేసే ఈ పాన్ ఇండియా ప్రయత్నం ఒక్క సినిమాకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అక్కినేని నాగ చైతన్య పాన్ ఇండియా హీరో అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన లవ్ స్టోరీ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా హిట్ అవుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ నడుస్తుండగా విడుదల తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది చూడాలీ.

సినిమా తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో నాగచైతన్య థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో మనం అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కగా ఆ తరువాత మరో వెరైటీ సినిమాగా థాంక్యూ తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల అవుతుందని అంటున్నారు. గతంలో ఈ దర్శకుడికి హిందీ లో సినిమా చేసిన అనుభవం ఉంది. అంతేకాదు నాగచైతన్య కూడా ఓ బాలీవుడ్ సినిమాలో మెరుస్తున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ చద్ధా సింగ్ అనే సినిమా లో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా ఈ పాత్ర తనకు బాలీవుడ్ లో మంచి పేరు ను తీసుకు వస్తుందని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: