టాలీవుడ్ లో దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుటుంబ ప్రస్థానం ఎప్పటికీ చెరిగిపోనిది. రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన ఇద్దరు కుమారులు తెలుగు సినిమా రంగంలో తమ‌దైన ముద్ర వేస్తున్నారు. సురేష్ బాబు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. రామానాయుడు రెండో కుమారుడు దగ్గుబాటి వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మూడున్నర దశాబ్దాలుగా తెలుగు తెరపై స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ల‌ను సొంతం చేసుకున్నారు. వెంకటేష్ సినిమా టైటిల్ లో రా అక్షరం చివర ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న‌ సెంటిమెంట్ ఉంది.

ప్రేమించుకుందాం రా - కలిసుందాం రా - జయం మనదేరా సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇదే సెంటిమెంట్ తో వచ్చిన ప్రేమతో రా సినిమా డిజాస్టర్ కూడా అయింది. ఇదిలా ఉంటే వెంకటేష్ కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో పుకార్లు వినిపించాయి. వెంకటేష్ ఒకానొక సమయంలో మీనాతో ఎక్కువగా సినిమాలు చేశాడు. వెంకటేష్ - మీనా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత వెంకటేష్ ది - దివంగ‌త‌ హీరోయిన్ సౌందర్య ది కూడా హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల మనసుల‌ను దోచుకున్నాయి. అప్పట్లో వీరు స్నేహంగా ఉండడం తో వీరి మధ్య కూడా ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే వాస్తవంగా వెంకటేష్ ఎప్పుడు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకున్నాడు అన్నది మాత్రం వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: