టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా, అత్యధిక ఫ్యాన్స్ ఉన్న హీరోగా చరిత్ర సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని వారినీ అభిమానులుగా మార్చుకొని వరుస సినిమాలతో సూపర్ హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఒకానొక సమయంలో ఆయన వరుసగా తొమ్మిది ఫ్లాపులను ఎదుర్కొన్న కూడా ఆయన అభిమానం కొంత కూడా తగ్గలేదు. దీన్ని బట్టి ఆయనకు అభిమానులు కాదు భక్తులు ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. 

కొందరి అభిమానుల్లో ఓ ధర్మ సందేహం ఉంది. పవన్ కళ్యాణ్ , కళ్యాణ్ బాబు ఈ రెండిట్లో ఏది ఆయన ఒరిజినల్ నేమ్ అనేది అందరికీ సందేహం కలిగించే విషయం. ఆయన తన సొంత తల్లిగా భావించే వదిన గారైన శ్రీమతి సురేఖ చిరంజీవి పవన్ ను చిన్నా అని పిలుస్తారు. కొంతమంది కుటుంబ సభ్యులు కళ్యాణ్ బాబు అని పిలుస్తారు. ఫ్యాన్స్ మాత్రమే ఆయన ను పవన్ కళ్యాణ్ అని పిలుస్తారు. మరి ఆయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు అని చెబుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గా పేరు ఎందుకు మార్చారు? దాని వెనుక ఉన్న కథ ఏంటో? తెలుసు కోవాలని చాలా కుతూహలం గా ఉన్నారు ఫ్యాన్స్.

దీని వెనుక పెద్ద కథే ఉందట. మార్షల్ ఆర్ట్స్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. తన సినిమాల్లో అవసరం ఉన్న చోటల్లా ఈ ప్రతిభను ప్రదర్శిస్తూ అభిమానాన్ని పొందుతారు. 97 లో సికింద్రాబాదులోని హరిహర కళాభవన్ లో మార్షల్ ఆర్ట్స్ తో ఆకట్టుకున్న కళ్యాణ్ కు ఓ పేరుగాంచిన  కరాటే అసోసియేషన్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచ గణనీయమైన విలువను కలిగి ఉన్న పవన్ అనే బిరుదు ప్రదానం చేసింది. ఆ విధంగా కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు . ఇక ఆయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అయ్యాప్పనుం కోశియం రీమేక్ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఆ తర్వాత హరిహర వీరమల్లు,  హరీష్ శంకర్ ఈ సినిమాను లైన్ లో పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: