సోషల్ మీడియా ను ఒక ఊపు ఊపాలన్నా ఎంతో ఫేమస్ అవ్వాలన్న భారీ పాపులారిటీ దక్కించుకోవాలన్న ఎంతో వెరైటీ టాలెంట్ ఉండాల్సిందే. ఎంతో నైపుణ్యం ఉంటే గానీ ఎవరు కూడా ఊరికే ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే వారు తమ టాలెంట్ ను ఎప్పటికప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అందజేస్తే వారు సదరు వీడియో లైక్ చేస్తారు. ఆ విధంగా ప్రియ ప్రకాష్ వారియర్ సోషల్ మీడియా లో ఓ టైంలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

కన్నుగీటు తో ఒక్కసారిగా దేశంలోని కుర్రకారును పడేసింది ఈ ముద్దుగుమ్మ. ఒరు అడార్ లవ్ సినిమా లో ఆమె నటించగా ఆ సినిమా లో కన్నుగీటే సన్నివేశం ఒక్కసారిగా దేశం మొత్తం పాపులర్ అయింది. కన్ను గీటిన సన్నివేశం వీడియో సోషల్ మీడియా లో ఒక్కసారిగా మారుమోగి పోగా దేశవ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపు సాధించింది.  ఈ ముద్దుగుమ్మ అంతకు ముందు ఓ మలయాళం సినిమా లో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించగా ప్రియా ప్రకాష్ ఈ సినిమాతో హీరోయిన్ గా మారి హిట్ తో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. 

ఈ నేపథ్యంలో ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి డిమాండు ఏర్పడగా నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే ఆమె తేజ హీరోగా నటిస్తున్న ఇష్క్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ లో శ్రీదేవి బంగ్లా, కన్నడలో విష్ణుప్రియ అనే సినిమాలో నటిస్తోంది.ఇవే కాకుండా ఈమెకు  మరిన్ని అవకాశాలు రాబోతున్నాయట. మలయాళం లోనుంచి వస్తున్న హీరోయిన్ లకు భారీ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ప్రియా ప్రకాష్ ఏ రేంజ్ లో అవకాశాలు సంపదిస్తుందో చూడాలి. నటన తో పాటు మంచి గ్లామర్ కూడా ఉన్న ఈ భామ ఏ రేంజ్ కి వెళుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: