ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు కొన్ని నిబంధనలను పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. అందులో ముందుగా ఉండేది నివేదాథామస్ , కీర్తి సురేష్. నివేద థామస్ కూడా తను పెట్టుకున్న నిభందలను ఉల్లంఘన చేయకుండా, అవకాశాలు రాకపోయినా పర్లేదు, వచ్చిన వాటితో సరి పెట్టుకుంటాను అంటూ.. మనకు చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. రీసెంట్ గా కీర్తి సురేష్ కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.


కీర్తి సురేష్ ఒక యంగ్ హీరో సరసన నటించడానికి ఇటీవల ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో దర్శకుడు హీరోతో లిప్ లాక్ సీన్ ఉంటుందని చెప్పాడట. అందుకు కీర్తి సురేష్ ఇలాంటి సన్నివేశాలు, ఈ సినిమాలో ఉన్నట్లయితే, ఆ సినిమాను నేను చేయడానికి కూడా ఇష్టపడనని, అవసరమైతే ఈ సినిమాను నేను వదులుకుంటాను..అని కూడా చెప్పిందట కీర్తి సురేష్. అయితే మరి కీర్తి సురేష్ కోరిక మేరకు , ఆ సినిమాలో ఆ సన్నివేశం  తీసివేస్తారో, లేక హీరోయిన్ నే  మార్చేస్తారో చూడాలి మరి.


ఇకపోతే ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో మన ముందుకు రావడానికి సిద్దమవుతోంది కీర్తి సురేష్. మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన  మహానటి సినిమాలో నటించి, మంచి ప్రేక్షకాదరణ పొందిన కీర్తి సురేష్, ఆ తర్వాత కేవలం అంతే  స్థాయిలో ఉన్న కథలనే ఒప్పుకుంటోంది అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే ఆమె నటించబోయే సినిమాలో హీరోలతో లిప్ లాక్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.


ఇకపోతే నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటించింది. ఇక  ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా కూడా కీర్తి సురేష్ ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా సినిమా అవకాశాలు రావడం గమనార్హం. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉంది కీర్తి సురేష్. అయితే ఈ సినిమాతో నైనా ఆమె క్రేజ్ మరింత పెరిగిపోతుందో లేదో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: